Stress: ఈ ఆహారం తింటే స్ట్రెస్ తగ్గుతుందట.. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది పని ఒత్తిడి అలాగే ఇతర కారణాలు, ఆలోచనల కారణంగా అధిక ఒత్తిడికి గురవుతూ

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 07:00 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది పని ఒత్తిడి అలాగే ఇతర కారణాలు, ఆలోచనల కారణంగా అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సరైన పోషకాలు లేని ఆహారం తిన్న కూడా ఇలాగే ఒత్తిడికి గురవుతారు అన్న విషయం తెలిసిందే. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు మనం అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శరీరం ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పకుండా పోషకాలు ఉండే విధంగా చూసుకోవడం తప్పనిసరి. ఒత్తిడిని తగ్గించే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆకుకూరలు తినడం వల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్స్, ఐరన్,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. గ్రీన్ టీలో క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండి ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే మెంతులు సొంటి పొడి యాలకులు వంటి వాటితో చేసి తేనీరు కూడా ఆరోగ్యానికి మంచిది. సోయాబీన్స్ తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మతిమరుపు దరిచేరకుండా చూస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండటం వల్ల వత్తిడి సమస్య తగ్గుతుంది. వెల్లుల్లిలో కాపర్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, బి 1, పీచుపదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఇవి శరీర ఆరోగ్యాన్ని సంరక్షించడం మాత్రమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచి ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది. గోధుమల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ఒత్తిడి ఆందోళనలను దూరం చేస్తుంది. బొప్పాయిలో ఉండే కెరోటిన్ శరీరంలోని విషతుల్యాల్ని బయటకు పంపుతుంది. ఇది మనసును తేలికపరిచి ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది. పాలలో ల్యాక్టోజ్ ఉండే నిద్రలేమి సమస్యలను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరిచి, ఒత్తిడి, ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.