Site icon HashtagU Telugu

AC: ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 21 Jun 2024 12 38 Pm 5537

Mixcollage 21 Jun 2024 12 38 Pm 5537

ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఏసీలను ఉపయోగిస్తున్నారు. ఏసీ వాహనాలను మాత్రమే కాకుండా ఇళ్లల్లో కూడా ఏసీలను ఫిట్ చేయించుకుంటున్నారు. మిగతా సీజన్లతో పోల్చుకుంటే వేసవికాలంలో ఏసీలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది రోజు మొత్తం ఏసీలోనే గడుపుతారు. కొద్ది సమయం వేడిని ఎదుర్కోవాల్సి వచ్చినా ఇబ్బంది పడిపోతారు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు షాపింగ్ మాల్స్ లో పనిచేసేవారు, బ్యాంకులలో పనిచేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ లోనే గడపాల్సి ఉంటుంది.

అటువంటివారు కొంచెం వేడి తగిలినా కూడా తట్టుకోలేరు. అయితే రోజంతా ఏసీలో ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏసీలో ఎక్కువ సమయం ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ముక్కు, గొంతు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎయిర్ కండిషనింగ్ పొడిగా ఉండటంతో గొంతులో కూడా పొడిగా ఉండి చికాకును కలిగిస్తుంది.

ఎక్కువ సేపు ఏసీలో గడిపేవారు ఊరికే అలసిపోతారు. బలహీనంగా ఉంటారు. పదే పదే నీరసానికి గురవుతూ ఉంటారు. వీటిని నివారించాలంటే తక్కువ ఏసీ ని ఉపయోగించడం మంచిది. అలాగే ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారికి తలనొప్పి వస్తుంది. గది వాతావరణం ఏసీ వల్ల పొడిగా ఉంటుంది. దీనివల్ల డీ హైడ్రేషన్ కు గురై బయటకు వెళ్లినప్పుడు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటుంటారు. ఏసీలో ఎక్కువ సేపు ఉండటంవల్ల చర్మంపై దుష్ప్రభావం పడుతుంది. పొడిగా మారడం, దురద అనిపించడంతో చికాకును కలిగిస్తుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.