Site icon HashtagU Telugu

Spinach Juice: ఎముకలు దృడంగా ఉక్కులా మారాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగాల్సిందే?

Mixcollage 06 Feb 2024 08 20 Pm 7136

Mixcollage 06 Feb 2024 08 20 Pm 7136

ఈ మధ్య కాలంలో చాలామంది కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. జాయింట్స్ దగ్గర నొప్పిస్తోందని ఎముకలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా 35 ఏళ్లు వయస్సు మీద పడిన వారికి ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల్లో ఉండే క్యాల్షియం తగ్గిపోయి ఎముకల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే అటువంటిప్పుడు క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగు పాలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటితో పాటుగా ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు ఎముకలు గట్టిగా దృఢంగా మారుతాయి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనకు మార్కెట్లో దొరికి ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. ఈ బచ్చల కూర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం, మాంగనీస్ లభిస్తాయి. అయితే ఎవరైతే క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటివారు ఈ బచ్చలికూర రసం తప్పనిసరిగా తాగాల్సిందే అంటున్నారు నిపుణులు. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఈ బచ్చలు కూడా జ్యూస్ తాగడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. బచ్చలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోఫితం చేస్తాయి.

బచ్చలి కూరలోని నైట్ రేట్లు రక్తపోటు లేవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. బచ్చలి కూర చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. ఈ బచ్చలి కూరలో ఉండే కేరుటో నాయ్డ్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి అలాగే రోగనిరోధక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ చలికాలంలో చాలా మంచిది. బచ్చలి కూర జ్యూస్ ఎన్నో తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బచ్చలకూరలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మధుమేహం క్యాన్సర్ అలాగే ఇతరత వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చలి కూర కంటికి చాలా ఉపయోగం చలికాలంలో బచ్చలకూర జ్యూస్ తాగడం వలన మీ ఎముకలు దృఢంగా మారుతాయి.