Site icon HashtagU Telugu

Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?

Eyebrows

Eyebrows

చాలామందికి కనుబొమ్మలు చాలా అందంగా ఉంటే కొందరికి మాత్రం పలుచగా, వచ్చి రానట్టుగా ఉంటాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక చాలామంది అందమైన కనుబొమ్మలు రావడం కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. మీరు కూడా అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా. ఒత్తైన కనుబొమ్మలు కావాలనుకుంటున్నారా. మరి అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సన్నని కనుబొమ్మలు ఉండేవారికి నూనె మసాజ్ మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. అవును కనుబొమ్మలను నూనెతో మసాజ్ చేయడం వల్ల కనుబొమ్మలు బాగా పెరుగుతాయట. ఇందుకోసం కొద్దిగా కొబ్బరినూనె లేదా ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను వేళ్ల చివరన తీసుకుని కనుబొమ్మలపై అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి, వెంట్రుకలు రాలిపోకుండా ఉండటానికి సహాయపడుతుందట.

అలాగే గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తో కనుబొమ్మలను బాగా మసాజ్ చేయడం వల్ల ఒత్తైన అందమైన కనుబొమ్మలను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆలివ్ నూనెలో కొద్దిగా తేనె కూడా కలపొచ్చు. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయట. అదేవిధంగా కనుబొమ్మలు త్వరగా పెరగడానికి ఉల్లిపాయ రసం కూడా ఎంతో ఉపయోగపడుతుందట. ఇందుకోసం ఉల్లిపాయల నుంచి రసం తీసుకోవాలి. తర్వాత వీటిని కనుబొమ్మ లపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఈ పద్దతిని ఫాలో అయినా మీ కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరుగుతాయి.

Exit mobile version