Sleep Tips: రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయాల్సిందే?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దాంతో అనేక

Published By: HashtagU Telugu Desk
Sleep Tipssleep Tips

Sleep Tipssleep Tips

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. కంటి నిండా సరిగా నిద్రపోతే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత జనరేషన్ లో మాత్రం పెద్దపెద్ద సిటీలలో మొబైల్ ఫోన్లు, ఫ్రెండ్స్ పార్టీస్ అంటూ ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొంటున్నారు. దాంతో చాలామంది సరిగా నిద్రపోక లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది మాత్రం రాత్రి సమయంలో నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అయితే నిద్ర పట్టడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి సమస్య. ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిద్ర పోవడానికి ముందు చేయకూడని పనులు ఏంటి అన్న విషయానికి వస్తే.. రాత్రి పూట నిద్ర పోయే ముందు వ్యాయామం చేయకూడదు. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టదు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. ఆలస్యంగా తింటే ఆహారం సరిగా జీర్ణం కాదు.

కడుపు ఉబ్బరంగా మారి నిద్ర దూరం అవుతుంది. అలాగే ఆల్కహాల్ వల్ల నిద్ర మత్తు ఉంటుంది కాని ప్రశాంతంగా నిద్ర పట్టదు. కాబట్టి మద్యానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే నిద్రపోవడానికి ముందు టీ, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి వేళ టీ, కాఫీ తాగితే వాటిలోని కెఫెన్ వల్ల నిద్ర పట్టదు. నిద్రకు ఉపక్రమించే ముందు బెడ్ రూంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ను దూరంగా పెట్టాలి. అలాగే బెడ్ రూంలలో లైట్స్ అన్నీ ఆన్ చేసి పెట్ట కూడదు. ఆ వెలుతురుకి నిద్ర సరిగా రాదు. రాత్రి సమయంలో నిద్ర రాక ఇబ్బంది పడే వారు పిస్తా తినాలి అని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ రాత్రి ప‌డుకునే ముందు కాస్త పిస్తా తింటే నిద్రలేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్టవచ్చు. అలాగే రాత్రి సమయంలో పాలు తాగి పడుకున్నా కూడా నిద్ర బాగా వస్తుంది.

  Last Updated: 18 Apr 2023, 04:01 PM IST