Site icon HashtagU Telugu

Summer Safety Tips: వేసవిలో ఈ ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. లేదంటే!

Summer Safety Tips

Summer Safety Tips

వేసవికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని కొన్ని సార్లు అది మన ప్రాణాల మీద కూడా రావచ్చు. సరేనా ఆహారాలు, పానీయాలు తీసుకోకపోతే ఎండ బారినపడి డీహైడ్రేషన్, వడ దెబ్బ వంటి సమస్యలు బారిన పడాల్సి వస్తుంది.. ఇది ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండలో కష్టపడి పని చేసే వాళ్ళు అలాగే ఎండలో తిరిగే వాళ్ళు రోజూ కనీసం నాలుగు లీటర్ల నీటిని అయినా తాగాలని చెబుతున్నారు. కష్టపడి పనిచేసే వారికి చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది.

అలాంటివారు ఇంకా ఎక్కువ మొత్తంలో నీటిని తాగాలని చెబుతున్నారు. అయితే ఇంటి పట్టునే ఉంటూ నీడలో ఉండేవారు రోజుకి 3 లీటర్ల వరకు నీళ్లు అయినా తాగాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేప్పుడు నూలు దుస్తులు, టోపీ ధరించాలట. అలాగే ఎండలో పనిచేసేవాళ్లు గంటకొకసారి నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల పట్ల జాగ్రత్త వహించాలి. వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల వడ దెబ్బ తగిలె అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా వడ దెబ్బ తగలకుండా ఉండాలి అంటే నీరు తాగాలని, నీడలో కొద్ది సేపు ఉండాలని చెబుతున్నారు.

అలాగే వేసవిలో ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి తరలించాలట. లోబీపీ, వణకటం వంటి సమస్యలు ఉన్నా జాగ్రత్తగా ఉండాలట. కొబ్బరి నీళ్లు సహా మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగాలట. పిల్లలను ఎండలో ఆడుకోవడానికి పంపకూడదని చెబుతున్నారు. ఆహారం మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినకూడదని స్పష్టం చేశారు. కూరగాయలు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలట. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు తినాలట.

Exit mobile version