వేసవికాలంలో మనకు విరివిగా దొరికే పండ్లలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఎక్కడ చూసినా కూడా మనకు మామిడి పండ్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు మనకు వేసవికాలంలోనే ఈ మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మామిడిపండ్లలో కూడా అనేక రకాల మామిడి పండ్లు ఉన్నాయి. భారతీయులు పచ్చి మామిడికాయలతో అనేక రకాల వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. మామిడి పండ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి అనే విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి మామిడిపండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
కాగా నానబెట్టి మామిడి పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మరి నానపెట్టిన మామిడిపండు వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా నానబెట్టకుండా తినడం వల్ల ముఖంపై మొటిమలు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు నానబెట్టి తినడం చాలా మంచిది. నానబెట్టిన మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది.
ఇందులో ఫైటోకెమికల్స్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు నానబెట్టిన మామిడి పండు తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.మామిడిని పండుగా చేసే పద్ధతిలో క్రిమిసంహారక మందులు వాడతారు. అయితే నీటిలో నానబెట్టి తినకపోతే నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మామిడి తినే క్రమంలో నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. మామిడి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా నానబెట్టిన మామిడి ముక్కలను తినడం వల్ల థర్మోజెనిక్ ఉత్పత్తి తగ్గుతుంది.