Site icon HashtagU Telugu

Soaked food: రాత్రిపూట ఈ పదార్థాలు నానబెట్టి తింటే చాలు.. ఆ సమస్యలని పరార్?

Soaked Food

Soaked Food

మనిషి ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే మనం తినే ఆహార పదార్థాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలను నీళ్లలో నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. మరి అటువంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెసలు.. వీటిలో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్ వంటి వ్యాధులు దరి చేరవు.

కిస్మిస్.. కిస్మిస్‌లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కిస్మిస్‌ను నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఎనీమియా, కిడ్నీ స్టోన్స్, ఎసిడిటీ వంటి వ్యాధులు దూరమౌతాయి. శెనగలు.. శనగలను నీటిలో నానబెట్టుకుని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అంజీర్ లను నానబెట్టి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బరువు తగ్గవచ్చు.

అంజీర్‌లో జింక్, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం.. విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే బాదం నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. బాదం రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Exit mobile version