Site icon HashtagU Telugu

Mango: మామిడిపండ్లను తినే ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి.. దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

Mango

Mango

మామిడి పండ్ల సీజన్ మొదలు కాబోతోంది. ఇప్పటికే మార్కెట్లోకి మామిడి పండ్లు దిగిన విషయం తెలిసిందే. ఉగాది పండుగ తర్వాత పూర్తి స్థాయిలో మార్కెట్లోకి మామిడి పండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే వేసవికాలంలో దొరికే ఈ మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. కాగా మామిడి పండ్లను కొందరు నేరుగా తింటే మరికొందరు రసాన్ని తీసి తాగుతుంటారు. ఇంకా మామిడి కారం, ఆవకాయ, పలు కూరల్లో ఈ పండను ఉపయోగిస్తారు. అయితే మామిడిపండ్ల తినడానికి ముందు నీటిలో నానబెట్టడం మనం చూసే ఉంటాం.

కనీసం ఒక 30 నిమిషాల పాటు నీటిలో మామిడి పండ్లు నానబెడుతూ ఉంటారు. ఆ తర్వాత వాటిని తింటూ ఉంటారు. అయితే ఇలా నీటిలో ఎందుకు నాన బెడతారు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడికాయలను తినడానికి ముందు నీటిలో నానబెట్టడం శతాబ్దాల నాటి నుంచి వస్తోంది. మీరు కొనే మామిడిపండ్లు సహజంగా ఉండవు, కృత్రిమంగా పండినవి అయి ఉండవచ్చు. కాల్షియం కార్బైడ్ పౌచ్‌ లను ఎక్కువగా మామిడి డబ్బాల్లో ఉంచుతారు. ఇక్కడ రసాయన ప్రక్రియ జరుగుతుంది.

దాని వల్ల ఎసిటిలీన్ వాయువు ఉత్పత్తి అవుతుందట. దీని కారణంగా పండు పండే ప్రక్రియ కృత్రిమంగా వేగవంతం అవుతుందట. కానీ మామిడిని బకెట్ నీటిలో నానబెట్టడం ద్వారా మామిడి సహజంగా లేదా కృత్రిమంగా పండినదా అని మీరు సులభంగా తెలుసుకోవచ్చట. మామిడిపండు నీటిలో మునిగితే సహజంగా పండినట్లు కానీ అది నీటిలో తేలుతూ ఉంటే అది కృత్రిమంగా వండినట్లు అర్థం చేసుకోవాలి. అలాగే మామిడిపండు శరీరంలో వేడి పెంచుతుంది. ఈ మామిడిపండు వల్ల మొటిమలు దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అలాగే తలనొప్పి వికారం వాంతులు విరేచనాలు వంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఈ సమస్యలేవీ రాకుండా ఉండాలి అంటే మామిడికాయను కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టి తినాలని చెబుతున్నారు. అందులో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు తగ్గి వేడి తగ్గుతుందట.