Jatamansi : జటామాన్సి.. మూర్ఛకు చికిత్స చేసే మూలిక

Jatamansi : ఔషధ గుణాలున్న ఎన్నో మూలికల మొక్కలు అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిన మూలిక.. ‘జటామాన్సి’.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 05:26 PM IST

Jatamansi : ఔషధ గుణాలున్న ఎన్నో మూలికల మొక్కలు అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిన మూలిక.. ‘జటామాన్సి’. ఇంగ్లిష్ లో దీన్ని ‘స్పైకెనార్డ్’ అంటారు. జటామాన్సి మొక్కలు హిమాలయాల్లో పెరుగుతాయి. జటామాన్సితో నూనెలు, పెర్ఫ్యూమ్స్  కూడా తయారు చేస్తుంటారు.  జటామాన్సీతో మూర్ఛకు చికిత్స చేయొచ్చు. జటామాన్సీ మన శరీరంలోని వాత, పిత్త, కఫంలను తగ్గించి.. వాటిని సమతుల్యం చేస్తుంది. ఫలితంగా మూర్ఛ ముప్పు తగ్గుతుంది. అయితే ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు తగిన మోతాదులో జటామాన్సీని వాడాలి. దీన్ని అతిగా వాడటం మంచిదికాదు. వైద్యుని సూచనల ప్రకారం.. ‘జటామాన్సి’ని పొడి రూపంలో లేదా కషాయాల్లో వాడొచ్చు. దీనితో తయారు చేసిన నూనెను జుట్టుకు నేరుగా పూయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

జటామాన్సీ ఇతర ప్రయోజనాలు

  • జటామాన్సీ మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  నాడీ వ్యవస్థలో వాతాన్ని మెరుగుపరుస్తుంది.
  • జటామాన్సీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఫోలికల్స్​ను మెరుగుపరిచి జుట్టుకు సహజమైన మెరుపు, సిల్కీనెస్​ని అందిస్తుంది. చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • నిద్రలేని రాత్రులను తరిమే సహజమైన ఇంటి నివారణి జటామాన్సీ.
  • జటామాన్సీ.. ఒత్తిడి, చిరాకు, నిరాశ, ఆందోళనలను దూరం చేస్తుంది.
  • జటామాన్సీ కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. జ్వరం, వెర్టిగో, నరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • జటామాన్సీ (Jatamansi).. ఆకలిని పెంచడమే కాకుండా జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

Also Read: Gajwel Battle: గజ్వేల్‌లో ఈటెల వర్సెస్ కేసీఆర్ మినీ యుద్ధం

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.