Snoring: గురక ఎక్కువగా పెడుతున్నారా.. అయితే జాగ్రత్త?

మాములుగా చాలామందికి నిద్రపోతున్న సమయంలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. అయితే గురక వారికి తెలియకుండానే పెడుతూ ఉంటారు. ఈ గురక సమస్య

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 10:00 PM IST

మాములుగా చాలామందికి నిద్రపోతున్న సమయంలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. అయితే గురక వారికి తెలియకుండానే పెడుతూ ఉంటారు. ఈ గురక సమస్య కారణంగా పక్కవారికి నిద్రలేకుండా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ గురకను మరీ భయంకరంగా పెడుతూ ఉంటారు. కొందరు గురక సమస్యను చాలా మంది తేలికగా తీసుకుంటారు. అయితే ఈ గురక తీవ్రమైన వ్యాధులకు సిగ్నల్‌ అంటున్నారు నిపుణులు. కొంతమందికి దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటుంది. ప్రతి రోజూ గురక పెట్టడం అనారోగ్యకరం. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదులతున్నప్పుడు మన మెడ, తలలోని మృదు కణజాలంలో వైబ్రేషన్స్‌ వల్ల మనం గురక పెడుతుంటాం.

ఈ సెన్సిటివ్‌ కణజాలం మన ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటాయి. నిద్రపోతున్న సమయంలో వాయుమార్గం రిలాక్స్‌ స్టేట్‌లో ఉంటాయి. ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.అందుకే మృదు కణజాలంలో కంపనలు ఏర్పడతాయి. మీకు ప్రతిరోజూ గురక పెట్టే అలవాటు ఉంటే కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతమట. మరి ఆ ప్రమాదకర వ్యాధులు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఒక నివేదిక ప్రకారం గురక స్ట్రోక్ ప్రమాదాన్ని 46 శాతం పెంచుతుంది. ఈ సమస్య స్మోకింగ్, ఆల్కహాల్‌ తాగడం వంటి చెడు అలవాట్ల కంటే కూడా చాలా ప్రమాదకరం. గురక ధమని దెబ్బతినడానికి సంకేతం కావచ్చట. కాబట్టి వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

గురక స్లీప్ అప్నియా కారణంగా వస్తుంటే ఇది మీకు డేంజర్‌ సైరన్‌తో సమానం. రాత్రి పూట రెండు, అంతకంటే ఎక్కువ సార్లు బాత్రూమ్‌కు వెళ్లడానికి నిద్రలేస్తూ ఉంటే ఆ కండీషన్‌ను నోక్టురియా అంటారు. నోక్టురియాకు, గురకకు సంబంధం ఉంది. యాభై ఐదు ఏళ్లు దాటిన పురుషులు రాత్రి పూట తరచుగా మూత్ర విసర్జనకు లేస్తుంటే ప్రోస్టేట్ విస్తరణ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉండే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. డయాబెటిస్‌, స్లీప్ అప్నియా మధ్య సంబంధం ఉందని యేల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. గురక పెట్ట అలవాటు ఉన్నవారికి డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుంది.

అదేవిధంగా నిద్రపోతున్నప్పుడు గురక పెట్టే వ్యక్తులు, ఇతర శ్వాస సమస్యలు ఉన్నవారకి హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత చిన్నవారైతే అంత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు కారణంగా గురక వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ బరువు ఉన్న వాళ్లలో కొవ్వు గొంతు భాగంలో పేరుకుపోయి గాలి తీసుకునే మార్గాన్ని చిన్నగా చేయడం వల్ల గురక వస్తుంది. అధిక బరువు సమస్య ఉంటే బరువు తగ్గడం మంచిది. నిద్రించే పొజిషన్‌ను మార్చుకుంటే గురక రాకుండా ఉంటుంది. వెల్లికిలా పడుకోవడం వల్ల గాలి తీసుకునే మార్గాలకు అడ్డంకి ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల ఒక పక్కకు పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది. ఒక వేళ మీకు ఆల్కహాల్‌, సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే మనేయడం మంచిది. పడుకునే ముందు కచ్చితంగా ఆల్కహాల్‌ తీసుకోకూడదు. నిద్రపోయే ముందు మద్యం తీసుకుంటే గొంతు కండరాలు విశ్రాంతి తీసుకోవడంతో గురక వస్తుంది. గురక వచ్చే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి. సరిగా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురై ముక్కు రంధ్రాల్లో శ్లేష్మం ఏర్పడి గురక వస్తుంది.