Site icon HashtagU Telugu

Smoking in AC Room: ఏసీ గదిలో స్మోకింగ్ చేస్తున్నారా.. ఇది ఆరోగ్యానికి ఎంత డేంజరో మీకు తెలుసా?

Smoking In Ac Room

Smoking In Ac Room

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది స్మోకింగ్ కి అలవాటు పడిపోయారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు చాలామంది ధూమపాలవాటు చేసుకుని వాడికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోతున్నారు. కనీసం 20 ఏళ్లు కూడా మించక ముందే ఈ స్మోకింగ్ అలవాటుకి బానిసలుగా మారిపోతున్నారు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నవారు ఎక్కడపడితే అక్కడ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అలా కొంతమంది ఏసీ గదుల్లో కూడా పొగ తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

మరి ఏసీ గదిలో స్మోకింగ్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. మొదటి ప్రమాదం ఆ స్మోకింగ్ కారణంగా ఏసీ పేలడం లాంటివి జరుగుతాయట. ఇక రెండవది ఆరోగ్యం పాడవుతుందని చెబుతున్నారు. ఎయిర్ కండిషన్డ్ గదిలో ధూమపానం శరీరం శీతలీకరణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుందట. దానివల్ల సిగరెట్ పొగతో వెలువడే వేడి శరీరం లోపలే ఉంటుందట.

ఇది గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలను ప్రభావితం చేస్తుందని, ఫలితంగా హీట్ స్ట్రోక్ కు సంబంధించిన సమస్యలు పెరగవచ్చని చెబుతున్నారు. అలాగే పరోక్షంగా సిగరెట్ పొగకు గురయ్యే వారికి కూడా ఈ అలవాటు ప్రాణాంతకం కావచ్చట. అతిగా ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. మీకు గుండె సమస్యలు ఉంటే, అది మరింత క్లిష్టంగా మారుతుందట. ఒకవేళ ఇంట్లో ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు మూసివేసిన గదిలో సిగరెట్ తాగడం వల్ల పొగ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతంలో వ్యాపిస్తుందట. సిగరెట్ పొగ శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినట్లే, అశుద్ధమైన ఇంటి లోపల గాలి కూడా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుందట. ఫలితంగా శ్వాసకోశ వ్యవస్థకు జరిగే నష్టం ఉందని చెబుతున్నారు.