Smart Phone: స్మార్ట్ ఫోన్ తో గుండెకు చేటు

తాజాగా స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు.

Published By: HashtagU Telugu Desk
Mobile Use

Mobile Use

స్మార్ట్ ఫోన్లతో ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్లతో కళ్లకు నష్టం కలుగుతుందని.. స్మార్ట్ ఫోన్‌ను చేత్తో పట్టుకుని చూసినంత సేపు మెడను అలా బెండ్ చేసి ఉంచడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పుల సమస్యల బాధితులు పెరిగిపోతున్నారు.

తాజాగా స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు. కేరళ కార్డియాలజిస్టుల సొసైటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై వైద్యులు మాట్లాడారు. అధిక ఒత్తిళ్లు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతున్నట్టు కేరళ కార్డియాలజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రభానాని గుప్తా పేర్కొన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్‌ను పరిమిత సమయం పాటు చూడడమే సమస్యకు పరిష్కారమని గుప్తా చెప్పారు.

  Last Updated: 31 Jan 2023, 05:37 PM IST