Mobile: మొబైల్ ఫోన్లు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. పక్కనే ఫోన్ లేకుంటే కాలం కదలదు. మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఒక

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 07:00 AM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. పక్కనే ఫోన్ లేకుంటే కాలం కదలదు. మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఒక భాగమైపోయాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల్లా కలిసిపోతున్నాయి. అయితే ఎంతగానో మనం ప్రేమించే ఈ మొబైల్ ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయని గ్రహించారా. స్మార్ట్ ఫోన్ లతో ప్రాణాలు పోతాయా అంటే అవుననే చెప్పాలి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్లను పక్కన పెట్టుకుంటున్నారా? మొబైల్ ఫోన్లను రాత్రి సమయాల్లో పక్కనే పెట్టుకుని నిద్రించడం వల్ల పలు ఆరోగ్య నష్టాలు కోరి తెచ్చుకున్నట్లే.

మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతులు లేదా లైటింగ్ మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఇది నిద్రను కష్టతరం చేస్తుంది. మొబైల్ ఫోన్‌ల నుంచి వచ్చే కాంతి మెదడులోని హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనే ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మొబైల్ ఫోన్ నుంచి వెలవడుతున్న కాంతిలో రేడియేషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. మరోవైపు మొబైల్ ఫోన్ అనేది వ్యసనంలా మారితే ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందని మరికొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మొబైల్ ఫోన్ లైటింగ్‌తో తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురు కంటి సమస్యలకు కారణమవుతోంది. దృష్టి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తగ్గించేందుకు, మీరు రాత్రి పడుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను మీ పక్కన పెట్టుకోవడం మానుకోవాలి. మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే, మీరు దానిని మీ తల నుండి కనీసం 6 అడుగుల దూరంలో ఉంచాలి. మీరు మీ మొబైల్ ఫోన్‌ను రాత్రి పడుకునే ముందు ఫ్లైట్ మోడ్‌లోకి మార్చేయాలి. ఇలా చేయడం వల్ల రాత్రివేళల్లో ఏదైనా ఫోన్ కాల్‌లు లేదా టెక్స్ట్‌లను అందుకోకుండా నిరోధిస్తుంది.

రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్ మీ పక్కన లేకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే కచ్చితంగా మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముందుగా మొబైల్ ఫోన్‌ను మీ పడకగదిలోకి తీసుకురావద్దు. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌ను ఫ్లయిట్ మోడ్‌లోకి సెట్ చేయాలి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్‌ టోన్‌లను బంద్ చేయాలి. మీరు పడుకునే ప్రాంతంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు. మీకు దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టండి. అదికూడా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తే మొబైల్ బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ మొబైల్ ఫోన్‌ల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తగ్గించవచ్చు అదేసమయంలో కంటి నిండా మంచి నిద్రను పొందవచ్చు.