Site icon HashtagU Telugu

Sleeping: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే స్నానం చేస్తే నీటిలో ఇది కలవాల్సిందే?

Mixcollage 12 Feb 2024 07 20 Am 8720

Mixcollage 12 Feb 2024 07 20 Am 8720

ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తున్న విషయం తెలిసిందే. రకరకాల కారణాల వల్ల చాలామంది సరిగా నిద్ర పట్టక అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. రోజంతా పనిచేసే అలసిపోయి, సరైన నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యకి కొన్ని చిట్కాల ద్వారా చెక్ పెట్టవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లావెండర్ ఆయిల్ ని రాత్రి సమయంలో స్నానం చేసే నీటిలో ఈ ఆయిల్ కలిపి చేస్తే పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఈ నూనె మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అలాగే హాయిగా నిద్ర పోవడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

ధ్యానం చేయడం, కంప్యూటర్స్, మొబైల్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిది. రాత్రి సమయంలో తిన్న తర్వాత కొద్ది దూరం నడవడం వలన ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. దాంతో పాటు మంచి నిద్ర పడుతుంది. రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తీసుకోవాలి. పాలలోని సెరోటిన్ మానసిక ఒత్తిడి తగ్గించి మంచి నిద్రకి సహాయపడుతుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు మీ పాదాలను నీటితో శుభ్రం చేసుకుని తర్వాత టవల్తో తుడిచి ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.

ఇలా చేయడం వలన మంచి నిద్రను ఆస్వాదిస్తారు. ఈ విధంగా మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి మీ శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడి కలిపి తీసుకోవాలి. ఇది మానసిక ఒత్తిడి తగ్గించే గుణాలు అశ్వగంధలో అధికంగా ఉంటాయి. అలాగే దీంతో నిద్రలేమి సమస్య కూడా చెక్ పెట్టవచ్చు. వీటితోపాటు రాత్రి సమయంలో కొంచెం తొందరగా అన్నం తిని ఆ తర్వాత 9:00 కి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.