Sleeping Naked: దుస్తులు లేకుండా నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మామూలుగా చాలామందికి రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఒంటిపై దుస్తులు లేకుండా పడుకోవడం అలవాటు. మరి కొంతమంది అయితే శరీరంపై ఒక్క దుస్తులు కూడా లేకుండా నిద్రపోతుంటారు.

  • Written By:
  • Updated On - July 17, 2024 / 10:42 AM IST

మామూలుగా చాలామందికి రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఒంటిపై దుస్తులు లేకుండా పడుకోవడం అలవాటు. మరి కొంతమంది అయితే శరీరంపై ఒక్క దుస్తులు కూడా లేకుండా నిద్రపోతుంటారు. ఎక్కువ శాతం మంది వేసవికాలంలో మాత్రమే ఇలా పడుకొని నిద్రపోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. లేదంటే రాత్రి సమయంలో వదులుగా లూస్ గా ఉండే దస్తులను మాత్రమే కొందరు ధరిస్తూ ఉంటారు. అయితే నిజానికి రాత్రి సమయంలో దుస్తులు లేకుండా ఇలా పడుకోవచ్చా? ఒకవేళ అలా పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా వేసవిలో దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల రాత్రిళ్లు చెమట పట్టదు. అలాగే శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందట. శరీర బరువు కూడా అదుపులో ఉంటుందట. శరీరం మీద దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట. వేసవిలో దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల శరీరం చల్లగా ఉండి రిలాక్స్ అయ్యి బాగా నిద్ర పడుతుందట. టైట్ గా ఉండే లోదుస్తులు వేసుకుని నిద్రపోయే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుందట.

మీరు టైట్ గా ఉండే దుస్తులు వేసుకుని నిద్రపోతే అది వృషణాలకు అసౌకర్యం కలిగిస్తుందట. దీని చెడు ప్రభావం సంతానోత్పత్తిపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి సమయంలో లోదుస్తులు తీసేసి నిద్రపోవడం వల్ల వీర్యకణాల సంఖ్య మెరుగుపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లోదుస్తులు ధరించడం వల్ల వచ్చే చెమట వల్ల ఇన్ఫెక్షన్లు రావట. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి సర్వ సాధారణ సమస్యగా మారింది. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలై శరీరం రిలాక్స్ అవుతుందని చెబుతున్నారు. అదేవిదంగా దుస్తులు లేకుండా నిద్రపోవడం బాగా నిద్రపడుతుందట. కంటినిండా నిద్రపోవడం వల్ల మీకు గుండెకు సంబంధించిన సమస్యలు రావట. కంటినిండా నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండెజబ్బులు, హైపర్ టెన్షన్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుందని అలాగే తర్వాతి రోజు మీరు ఎనర్జిటిక్ గా పనిచేసుకోగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow us