Site icon HashtagU Telugu

Health Tips: తిన్న వెంటనే పడుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

Health Tips

Health Tips

మనలో చాలామంది తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి తిన్న వెంటనే పడుకుంటే ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందట. దీనివల్ల మీకు అలసట, నిద్రలేమి, సమస్యతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. అందుకే తిన్న వెంటనే పడుకోకూడదని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మీరు తిన్నది నెమ్మదిగా జీర్ణమవుతుందట.

దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే తిన్న వెంటనే నిద్రపోకూడదని పెద్దలు చెబుతున్నారు. అలాగే తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మీకు సరిగ్గా నిద్రరాదు. ఇది మీ దినచర్యకు భంగం కలిగిస్తుందట. అలాగే ఈ అలవాటు బీపీని కూడా పెంచుతుందని చెబుతున్నారు. మీరు తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల పీడకలలు వస్తాయట. ఈ కారణంగానే పగటిపూట తిన్న వెంటనే నిద్రపోకూడదని, తిన్న తర్వాత కాసేపు నడవాలని చెబుతుంటారు.
కాగా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మీ మెటబాలిజం బలహీనపడుతుందట.

దీనివల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే మీ జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందట. దీనివల్ల మీకు ఎసిడిటీ సమస్య వస్తుందని, అంతేకాదు ఈ అలవాటు వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉందట. అవును భోజనం చేసిన వెంటనే మీరు పడుకోవడం వల్ల ఫ్యాట్స్ పెరిగిపోతాయి. మీరు బరువు పెరిగితే ఎన్నో ఇతర రోగాల బారిన పడాల్సి వస్తుందమీ చెబుతున్నారు.