Site icon HashtagU Telugu

Sleep Disorder : నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

Sleeping Disorder

Sleeping Disorder

మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అసలు సగం వ్యాధులకు కారణం సరైన నిద్ర లేకపోవడం వల్లే అని అంటుంటారు. మనకున్న ప్రతి సమస్యకు అదే పనిగా ఆలోచిస్తూ నిద్రని పాడు చేసుకుంటాం. వరల్డ్ వైడ్ గా నిద్ర సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా పెద్దదిగానే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి దాకా నిద్రలేమి సమస్య (Sleep Disorder ) బాధిస్తుంది.

శరీరానికి సరైన నిద్ర అనగా రెస్ట్ ఇవ్వడం వల్ల కొన్ని అనారోగ్యాల నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. (Sleep Disorder) నిద్ర సరిగా లేకపోవడం వల్ల జాపకశక్తి తగ్గుతంది. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు.

రక్తపోటు, గుండె సమస్యలతో పాటుగా జీర్ణ సమస్యలు, మధుమేహం లాంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి సరైన జీవన విధానంలో సరైన నిద్ర కూడా ముఖ్య పాత్ర పోశిస్తుంది. అయితే నిద్ర పోవడం వరకు ఓకే కానీ జీవన శైలిలో మార్పుల వల్ల నిద్రలో ఎక్కువసార్లు మెలకువ వచ్చినట్టు అవుతుంది.

టీ, కాఫీ ఎక్కువ తాగడం వల్ల నిద్ర నుంచి త్వరగా మెలకువలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదు రోజు వ్యాయామం చేసి శరీరానికి అలసట కలిగించాయి. అలా చేయకుండా ఉన్నా కూడా నిద్రలో ఊరకే మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకుండా చేస్తుంది. నిత్యం వ్యాయామం వల్ల నిద్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Also Read : TCS : ఉద్యోగులకు టీసీఎస్ షాక్.. నో వర్క్ ఫ్రమ్ హోమ్..!