Site icon HashtagU Telugu

Brushing: ‎ఏంటి.. ఒక్కరోజు పళ్ళు తోముకోకపోతే ఇంత డేంజరా.. వామ్మో!

Brushing

Brushing

Brushing: ఉదయం నిద్ర లేవగానే మనం మొదటిగా చేసే పని పళ్ళు శుభ్రం చేసుకోవడం. పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాతనే ఇతర పనులు మొదలు పెడుతూ ఉంటారు. కొందరికి ఉదయం లేవగానే నీరు తాగే అలవాటు ఉంటుంది. కొందరు బ్రష్ చేసుకోక ముందు తాగితే మరికొందరు బ్రష్ చేసుకున్న తర్వాత తాగుతూ ఉంటారు. అయితే కొందరు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచినప్పుడు పళ్ళు తోముకోవడానికి బద్దకించి అలాగే ఉంటారు. కానీ ఈ చిన్న అలవాటు ప్రాణాపాయానికి కూడా దారితీసే అవకాశం ఉందట. మనం తిన్న 4 నుంచి 6 గంటల తర్వాత దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడటం మొదలవుతుందట.

‎ 12 గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్‌ గా మారుతుందని, 24 గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. కాగా మీరు ఒక రోజు పళ్లు తోముకోకపోతే మీ నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందట. పళ్లు తోముకోకుండా ఈ అలవాటును కొనసాగించడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, చివరికి మరణానికి కూడా దారితీయవచ్చని చెబుతున్నారు. రోజూ పళ్లు తోముకోని వ్యక్తులకు మరణ ప్రమాదం 25 శాతం పెరుగుతుందట. ఒక సంవత్సరం పాటు పళ్లు తోముకోకపోతే మీ గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ధమనులలో వాపును కలిగిస్తుందట.

‎ఇది గుండె సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియాకు కూడా కారణమవుతుందట. పొగాకు వాడకపోయినా, పళ్లు తోముకోని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సంవత్సరం పాటు పళ్లు తోముకోకపోతే దంతాలు పూర్తిగా కుళ్ళిపోయి, కుహరాలు, చీము, విపరీతమైన నొప్పికి దారితీస్తాయట. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమై, దంతాలు వదులై ఊడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఒక రోజు పళ్లు తోముకోకపోవడం చిన్న విషయమేమీ కాదు. మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని రక్షించడానికి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. కాబట్టి మన దైనందిన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక్క ఐదు నిమిషాలు పళ్ళు తోముకోవడానికి కేటాయించి ఉదయం రాత్రి రెండు ఫోటోలు శుభ్రం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.

Exit mobile version