మొటిమల సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. మొహంపై మొటిమలు ఉంటే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అవి కొన్నిసార్లు ఎర్రగా మారుతాయి. మంట పుట్టిన ఫీలింగ్ ను కలుగజేస్తాయి. మీరు అద్దంలో మొహాన్ని చూసుకున్న ప్రతిసారీ.. మొటిమలను చిదిమేయాలనే ఆలోచన వస్తుంది. చర్మంపై మొటిమలు ఏర్పడటానికి శరీరంలోని హార్మోన్లు మార్పులకు గురికావడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే, ఇదే ఏకైక కారణం కాదు. స్టెరాయిడ్స్ వంటి మందుల వాడకం వల్ల లేదా నాణ్యత లేని సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల కూడా మీ ముఖం మీద మొటిమలు వస్తాయి. మీ చర్మంపై మొటిమలు రావద్దంటే .. మీ రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే ఆహారం ప్రభావం కూడా చర్మంపై కనిపిస్తుంది.
కొన్ని చిట్కాలు
* ఒక పోషకాహార నిపుణులు ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. రక్తం నుంచి విషాన్ని తొలగించి, మొటిమలు లేని చర్మాన్ని పొందడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను వారు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మీరు తరచుగా మొటిమలు రావడంతో ఇబ్బంది పడుతుంటే.. మహామంజిష్ఠాది క్వాత్ వంటి మూలికలను తినాలి.
ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్రమంగా మొటిమలను నివారిస్తుంది.
* జంక్ ఫుడ్ బాగా తింటే కూడా మొటిమలు వస్తాయి. రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి చాక్లెట్లు, కార్బోనేటేడ్ డ్రింక్స్ మరియు ఇతర జంక్ ఫుడ్ పదార్థాలకు దూరంగా ఉండాలి.
* పిజ్జాలు, ఫర్సాన్‌లు, బంగాళదుంప చిప్స్ , ఇతర వేయించిన ఫుడ్స్ లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.ఇవి మొటిమలకు కూడా కారణమవుతాయి.
* ఆహారంలో తాజా కూరగాయలు , పండ్లను చేర్చుకోవడం మంచిది. అవి మీ శరీరానికి అవసరమైన ఫైబర్ , మంచి కొవ్వులను కలిగి ఉంటాయి.