Skin Protection : పాలతో చర్మాన్ని ఎండాకాలంలో తాజాగా ఉంచుకోవడం ఎలా?

చర్మం తాజాగా ఉంచుకోవడానికి, ఎండ వలన వచ్చే ట్యాన్ తొలగించుకోవడానికి మనం మన ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పాలని ఉపయోగించుకొని మన చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 10:30 PM IST

ఇప్పుడు ఎండాకాలం(Summer)లో మన చర్మం(Skin) వాడిపోతుంటుంది. అలాగని మనం మన పనులని మానుకోలేము కాబట్టి ఏదో ఒక పని మీద మనం బయటకు వెళుతుంటాము దాని వలన మన చర్మం జీవాన్ని కోల్పోతుంటుంది. అయితే ఎండాకాలం అయినా కొంతమంది మేకప్(Makeup) లు వాడుతుంటారు. దీని వలన చర్మం ఇంకా పాడవుతుంటుంది. చర్మం తాజాగా ఉంచుకోవడానికి, ఎండ వలన వచ్చే ట్యాన్ తొలగించుకోవడానికి మనం మన ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పాలని ఉపయోగించుకొని మన చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.

చర్మం పైన పచ్చి పాలతో మర్దనా చేయాలి. శనగపిండి లేదా బియ్యంపిండి లో ఏదయినా ఒక దానిలో కొద్దిగా పాలను కలిపి మన చర్మం పైన స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం పైన వచ్చిన ముడతలు తగ్గడానికి కూడా పాలను ఉపయోగించవచ్చు. రోజూ మనం స్నానం చేసే నీటిలో రెండు స్పూన్ల పాలను కలపాలి. ఇలా చేయడం వలన చర్మం పైన ముడతలు తగ్గుతాయి. ఎండాకాలంలో మనం ముఖాన్ని ఎక్కువ సార్లు కడుగుతుండాలి. దీనివలన చర్మం ఫ్రెష్ గా ఉంటుంది.

ఎండాకాలంలో వేడికి చర్మం పొడిబారి ట్యాన్ అవుతుంది. పాలల్లో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మం తాజాగా మారేలా చేస్తుంది. దాని కోసం పచ్చి పాలల్లో దూదిని ముంచి దానితో ముఖానికి రాసుకోవాలి. ఒక పది నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన మన చర్మం ఫ్రెష్ గా కనిపిస్తుంది, ఇంకా మొటిమలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. ఒక స్పూన్ గంధం లో కొద్దిగా పాలు పోసుకొని దానిని ఫేస్ ప్యాక్ లాగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మన చర్మం పైన ఉండే దుమ్ము, ధూళి మృతకణాలు తొలగిపోతాయి. ఇంకా మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.