Skin Care : అబ్బాయిలూ…సమ్మర్ లో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి..!!

అబ్బాయిల చర్మం అమ్మాయిల కంటే చాలా దృఢంగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో ప్రతి ఒక్కరి చర్మంపై ప్రభావం ఉంటుంది. అది అబ్బాయి కావచ్చు...అమ్మాయి కావచ్చు.

  • Written By:
  • Updated On - May 1, 2022 / 06:09 PM IST

అబ్బాయిల చర్మం అమ్మాయిల కంటే చాలా దృఢంగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో ప్రతి ఒక్కరి చర్మంపై ప్రభావం ఉంటుంది. అది అబ్బాయి కావచ్చు…అమ్మాయి కావచ్చు. వేసవిలో హీట్ పుట్టించే ఎండలు…వేడి గాలులు…మన చర్మాన్ని కమిలిపోయేలా చేస్తాయి. అలాంటి బలమైన సూర్యకాంతిలో ఎలాంటి సన్ స్క్రీన్ అయినా సరే అస్సలు ఉపయోగపడదు. అలాంటి పరిస్థితిలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో చెమల, దుమ్ము, కలుషితమైన గాలి చర్మరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తతాయి.

ఎండాకాలంలో చర్మంలో తేమను కాపాడుకోవడం ముఖ్యం. మీ చర్మం జిడ్డుగా ఉండి…తేమ లేనట్లయితే మీ చర్మం లోనుంచి నూనె బయటకు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి సమ్మర్ లో అబ్బాయిలు తమ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.

సమ్మర్ లో అబ్బాయిలు చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి…
ఎండాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాడానికి సులభమైన మార్గం చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పుష్కలంగా నీరు తాగాలి. నీరు శరీరం, చర్మాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఒక వ్యక్తి రోజుకు కనీసం 6 నుంచి 7లీటర్ల నీరు తాగడం ముఖ్యం. చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు…ముఖంలో కాంతిని పెంచడంలో నీరు చాలా సహాయపడుతుంది.

పండ్లు ఎక్కువగా తీసుకోవాలి…
ఎండలనుంచి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలంటే నీరు ఎక్కువగా తాగడంతోపాటు…కీరదోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తినాలి. ఈ సీజన్ లో పండ్లలో పుష్కలంగా నీరు లభిస్తుంది.

తరచుగా సన్‌స్క్రీన్ ఉపయోగించండి..
కాలం ఏదైనా సరే…పనికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఎండాకాలంలో వేడిగాలికి చర్మం కాలిపోతుంది. అలాంటి పరిస్థితిలో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. దీని వల్ల చర్మంలో టానింగ్ ఉండదు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగపడుతుంది.

చల్లని నీరుతో తరచుగా ముఖం కడుక్కోవాలి…
వేసవి కాలంలో దుమ్ము, సూర్యకాంతి వల్ల మన ముఖంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. కావున సమ్మర్ లో రోజుకు కనీసం రెండుసార్లయినా ఫేస్ వాష్ తో మీ ముఖాన్ని కడగండి. ఇలా చేస్తే మీ ముఖంపై పేరుకుపోయిన దుమ్ము బయటకు వెళ్తుంది. వీలైతే వారానికి కనీసం 2 సార్లు ముఖాన్ని స్క్రబ్ చేయడం మంచిది.

రసాయనాలు కలిగిన ఉత్పత్తులకు దూరంగా…
మనం ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తాము. కానీ ఈ ఉత్పత్తులను నిత్యం వాడటం వల్ల మన చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. వాటికి బదులుగా, మీరు ఇంట్లో సహజ వస్తువులను ఉపయోగించుకోవడం బెటర్. ఇది మీ చర్మానికి హాని కలిగించదు. మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.