Skin Care: బ్యూటిఫుల్ స్కిన్ కోసం ఈ ఫుడ్స్ బెస్ట్..!

ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తినే కొంతమందికి మొహంపై మొటిమలు వస్తుంటాయి. చర్మంపై మంట కలుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే.. గ్లోయింగ్ స్కిన్, క్లియర్ స్కిన్ , సాఫ్ట్ స్కిన్ కావాలంటే.. మంచి ఫుడ్స్ తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినాలి.

  • Written By:
  • Publish Date - February 18, 2023 / 09:30 AM IST

ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తినే కొంతమందికి మొహంపై మొటిమలు వస్తుంటాయి. చర్మంపై మంట కలుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే.. గ్లోయింగ్ స్కిన్, క్లియర్ స్కిన్ , సాఫ్ట్ స్కిన్ కావాలంటే.. మంచి ఫుడ్స్ తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినాలి. ఇక ఇదే సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్స్, వేపుడులు, రెడ్ మీట్, సోడాతో పాటు చక్కెర ఉన్న ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

 ■ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ ఇవీ..!

గ్లోయింగ్, హెల్తీ స్కిన్ కోసం తినాల్సిన 7 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం..

★ టొమాటో 

టొమాటోలో లైకోపీన్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి .ఇవి రెండూ శరీరంలో మంటను అరికట్టడంలో సహాయపడే పోషకాలు.  టొమాటోలలో యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య కరమైన చర్మానికి అద్భుతమైన సప్లిమెంట్స్. టమాటాలు పచ్చివి తినండి. వీటిని ఫ్రైస్‌లలో కలిపి తినండి. టమాటా సాస్ లు కూడా మంచివే.

★ వెల్లుల్లి 

యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందించే సహజ ఆహారాలలో వెల్లుల్లి ఒకటి. ఇది శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. మీ వంటలలో వెల్లుల్లిని జోడించండి.

★ ఆకు కూరలు

ఆకుకూరలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసే విటమిన్ సి వీటిలో పుష్కలంగా ఉంటుంది.

★ నట్స్

బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పులు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు వంటి వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

★ బ్లూబెర్రీస్ 

బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరంలో కలిగే మంటను తగ్గిస్తాయి.  ఆరోగ్యకరమైన చర్మం కోసం వాటిని పచ్చిగా తినండి. సలాడ్లలో జోడించి కూడా తీసుకోవచ్చు.

★అవకాడో 

ఒమేగా -3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా శరీరంపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగించగలవు. అవకాడోలలో ఆరోగ్యకరమైన మోనో అసంతృప్త కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీకు మెరిసే చర్మాన్ని అందిస్తాయి.