అశ్వగంధ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని ఏళ్ల నుంచి అశ్వగంధను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అశ్వగంధలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ వీటిని అనేక రకాల వాటిలో వినియోగిస్తూనే ఉన్నారు. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే రాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే. అశ్వగంధ చిత్త వైకల్యంతో బాధపడే వారిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
దీనిని తీసుకుంటే మతిమరుపుకు దోహదం చేసే కణాలను కట్టడి చేస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని కూడా కోల్పోకుండా చేస్తుంది. అశ్వగంధ క్రమం తప్పకుండా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన, నిరాశ నిస్పృహల నుండి బయటపడవచ్చు. ఇది మెదడులోని కొన్ని న్యూరో ట్రాన్స్ మీటర్ల స్రావానికి సహాయపడుతుంది. మానసిక స్థితి మెరుగుపరచడానికి, మనస్సును, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ డిమెన్షియా ఉన్న రోగులకు రోజూ అశ్వగంధ పెడితే గుర్తించే ఫలితాలు కనిపిస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియాలను నియంత్రించే యాంటీ కన్వల్సెంట్ గుణాలు అశ్వగంధలో ఉంటాయి. అశ్వగంధ డిప్రెషన్ కు మరియు పాజిటివ్ మైండ్ సెట్ కు కొనసాగించడం కష్టమని భావించే వారికి విస్తృతంగా సహాయపడుతుంది.
దీని ద్వారా మనస్సుకు విశ్రాంతి ప్రశాంతత లభిస్తుంది. అశ్వగంధ నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ గ్రంథులు రోగనిరోధక వ్యవస్థ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అశ్వగంధలో వివిధ జీవ రసాయనాలు, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవి శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. అశ్వగంధ వేగంగా కణాల పునరుత్పత్తి పునురుజ్జీవనానికి కూడా సహాయపడుతుంది. అంతే కాదు, ఇది వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, తేమగా, ముడతలు లేకుండా ఉంచుతుంది. అశ్వగంధ రూట్ పౌడర్ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను కట్టడి చేయడానికి సహాయపడతాయి. ఇది హానికరమైన యూవీ కిరణాలు లేదా విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వేగవంతమైన ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తుంది.