Site icon HashtagU Telugu

Face Masks : మాస్క్ ఎన్ని లేయర్లు ఉంటే మంచిది.. నిపుణులు ఏం చెప్తున్నారు?

Six Layer Face Mask

Six Layer Face Mask

ప్రపంచాన్ని కోవిడ్ చుట్టుముట్టినప్పటి నుంచి జనాలంతా మాస్కుని తగిలించుకున్నారు. అప్పటివరకు స్వేచ్ఛగా బతికున్న మనకు కరోనా రావటంతో మాస్క్ లేనిదే బ్రతకలేము అన్నట్లుగా మారింది. దీంతో గత మూడు సంవత్సరాల నుండి కరోనా వెంటాడుతూనే ఉంది. ఇక ఆ మధ్య తగ్గుముఖం పట్టినట్లే పట్టగా మళ్లీ ఇప్పుడు వెంటాడుతుంది.

ఇక కరోనా ఉన్న లేకున్నా మాస్కులు ధరించడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. మామూలుగా మాస్కులు ధరించడం వల్ల ఇతర వైరస్, బ్యాక్టీరియా, దుమ్ము, అలర్జీ రకారకాల జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. దీంతో కొంతమంది ఇప్పటికీ మాస్కులు ధరిస్తూనే ఉన్నారు. మరి కొంతమంది వైరస్ అంతరించిపోయింది అని మాస్కులు పక్కన పడేశారు.

కానీ మాస్కులు ధరించడం శ్రేష్టకరమని అంటున్నారు. అది మనకు మెరుగైన రక్షణ ఇచ్చేది. ఇక మనం వాడే మాస్కులలో కూడా కొన్ని రకాల మాస్కులు ఇబ్బందిగా ఉంటాయి. వాటి వల్ల శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో గతంలో ఎన్ 95 మాస్క్ చాలా మెరుగైనది అని నిపుణులు కూడా తెలిపారు. ఇక సర్జికల్ మాస్క్ కూడా మంచి రక్షణ ఇస్తుందని అన్నారు.

అంతేకాకుండా ఆరు లేయర్లతో కూడిన క్లాత్ మాస్క్ కూడా చాలా మంచిదని మంచి రక్షణగా ఉంటుందని తాజాగా నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ మాస్కులను రోజువారిగా వినియోగించుకోవచ్చని.. ఈ మాస్కులు వినియోగించుకోవడం వల్ల ఎటువంటి వైరస్ అతి సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా లోపలికి రాదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఆరు లేయర్ల మాస్క్ వినియోగించడం మంచిది.