Site icon HashtagU Telugu

Memory Loss : గంటల తరబడి కూర్చుంటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా? రోజూ ఎంతసేపు నిలబడాలి?

Back Pain

Back Pain

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతుంది. ఇలా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల భుజం, వెన్నునొప్పి కూడా వస్తాయి. (Back and Neck Pain) ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల మెదడుపై కూడా కొంత నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని న్యూయార్క్‌కు చెందిన ” గ్లోబల్ వెల్‌బీయింగ్ లీడ్ ” (Global Well Being Lead) తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెన్నుపాముపై ప్రభావం వల్ల మనిషి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఎంతసేపు కంటిన్యూయస్ గా కూర్చోవాలో తెలుసా?

ఒక వ్యక్తి రోజులో కనీసం మూడు గంటల పాటు నిలబడాల్సిన అవసరం ఉందని ” గ్లోబల్ వెల్‌బీయింగ్ లీడ్ ” తెలిపింది. ఉదాహరణకు మీరు ఆఫీసులో రోజూ 8 గంటలు పని చేయాల్సి ఉంటుందని అనుకోండి. ప్రతి అర్ధగంటకు ఒకసారి 2 నిమిషాల పాటు లేచి నిలబడండి. అంత మాత్రానికి మీకు ఆఫీసులో ఎవరూ నో చెప్పరు కదా.. నిలబడటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి (Sugar Levels) తగ్గుతుంది.  ఒత్తిడి కూడా డౌన్ అవుతుంది.  వీపు , భుజం పై పడుతున్న భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు కనీసం అర గంటకు ఒకసారి నిలబడితే న్యూరల్ ఏజింగ్ (Neural Ageing ) జరగకుండా నిరోధిస్తుంది.  ఎందుకంటే, నిలబడటం వల్ల టెంపోరల్ లోబ్ చెడిపోతుందనే భయం తగ్గిపోతుంది.  మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగం జ్ఞాపకశక్తిని నిల్వ చేస్తుంది.  నిలబడటం ద్వారా.. తల నుంచి కాలి వరకు రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. రక్తప్రసరణ (Blood Cirlulation) సరిగ్గా జరిగితే.. శరీరం అలసట కూడా తగ్గుతుంది.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చొని ప‌ని చేసే వారి మ‌ర‌ణాలు దాదాపు 60 శాతంగా ఉన్నాయి. ప్ర‌తీ రోజు 8 గంట‌ల కంటే ఎక్కువ‌గా క‌ద‌ల‌కుండా కూర్చొని ప‌ని చేసేవారు ఊబ‌కాయంతో మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంద‌ని చాలా పరిశోధ‌న‌లు తెలిపాయి. త‌క్కువ స‌మ‌యం కూర్చొని ప‌ని చేసే వారిలో మ‌రణాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ట్టు కొన్ని అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేసే ఉద్యోగులు మ‌ధ్య మ‌ధ్య‌లో కొద్ది సేపు లేచి నిల‌బ‌డి ఒక ఐదు నుంచి ప‌ది నిమిషాల వ‌ర‌కు విరామం తీసుకోవాలి. అంతేకాదు.. వీరు ఎక్కువ‌గా వాట‌ర్ తీసుకోవాలి. ఇలా చేస్తే వారి ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.