‎అపరాజిత టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, వారు అస్సలు తాగకూడదట.. ఎవరో తెలుసా?

‎అపరాజిత పుష్పంతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ కొందరికి మాత్రం అంత మంచిది కాదని దీనివల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ టీ ని ఎవరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Blue Tea

Blue Tea

  • అపరాజిత టీ వల్ల కలిగే లాభాలు
    ‎ఆ సమస్యలను మరింత పెంచే టీ
    ‎అపరాజిత పుష్పాల వల్ల కలిగే ప్రయోజనాలు

    ‎Blue Tea: చాలామంది ఇంటి ఆవరణలో పెరట్లో అపరాజిత పుష్పాలను పెంచుకుంటూ ఉంటారు. ఈ పూలు చాలా రకాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో నీలిరంగు పుష్పాలు కూడా ఒకటి. ఈ పుష్పాలను పరమేశ్వరుడి పూజలో అలాగే శనీశ్వరుడి పూజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పూలు కేవలం దేవుడి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పువ్వులతో టీ చేసుకుని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ టీని బ్లూ టీ అని పిలుస్తారు.

    ‎కాగా అపరాజిత పూల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతున్న వాతావరణంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే అపరాజిత టీ మీకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెబుతున్నారు.. ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటమే కాకుండా మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచేలా చేస్తుందట. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారికి అపరాజిత టీ ఒక వరం అని చెబుతున్నారు. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుందట.

    ‎తద్వారా శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు సులభంగా కరుగుతుందని చెబుతున్నారు. రోజువారీగా ఈ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో అపరాజిత టీ అద్భుతంగా పనిచేస్తుందట. ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయట. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తమ డైట్‌ లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చట. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఈ టీ కీలక పాత్ర పోషిస్తుందట. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుందట.

    ‎ తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకొని నీరు వేడెక్కాక అందులో 4 నుండి 5 శుభ్రం చేసిన అపరాజిత పువ్వులను వేయాలట. నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలట. తర్వాత స్టవ్ ఆపి, నీటిని వడకట్టాలి అని చెబుతున్నారు. రుచి కోసం అందులలో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా ఆస్వాదించాలని చెబుతున్నారు. నిమ్మరసం పిండితే టీ రంగు నీలం నుండి ఊదా రంగులోకి మారుతుందని,ఇది చూడ్డానికి చాలా బాగుంటుందని చెబుతున్నారు.
  Last Updated: 18 Dec 2025, 10:16 AM IST