Bloating: కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే చిట్కాలు మీకోసం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆహారపు అలవాట్ల కారణంగా కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. కడుపు

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 09:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆహారపు అలవాట్ల కారణంగా కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. కడుపు ఉబ్బరంగా ఉండడం వల్ల తినాలని కోరిక ఉన్నా కూడా తినలేక ఇబ్బంది పడుతూ చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్న కొద్ది తినాలి అంటేనే విరక్తి పుడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వారు కూల్ డ్రింక్, సోడా లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే ఇప్పుడైనా కానీ భోజనం చేసేటప్పుడు నిటారుగా కూర్చుని తినాలి. నోరు మూసుకొని ఆహారాన్ని నములుతూ తినేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలి. పొట్టలోకి గాలి వెళ్లడం వల్ల కడుపుబ్బరం సమస్యలు వస్తాయి.

అయితే కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. అలా నడుస్తున్నప్పుడు పొట్టని లోపలికి బయటికి అనడం లాంటివి చేయాలి. అలా చేయడం వల్ల కడుపు లోపల గాలి బయటకు వెళ్లి కడుపు ఉబ్బరం సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత వెళ్లికిలా పడుకొని గాలి పీలుస్తున్నప్పుడు రెండు చేతులను పైకి లేపి అలాగే ఉంచి శ్వాస నిదానంగా వదులుతూ మీ రెండు కాళ్ళను నేలకు లంబంగా పైకి లేపాలి.

కొన్ని సెకండ్ల పాటు ఉంచిన తరువాత మీ కాళ్ళను కిందికి తీసుకుని విశ్రాంతి తీసుకోవాలి. వెన్ను బలహీనంగా ఉన్నవారు ఒక కాలును మాత్రమే పైకి లేపాలి. ఇలా ఈ ఆసనాన్ని ఆరు ఏడు సార్లు రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. నిమ్మరసం అల్లం నీరు ఆల్కలీన్ పిహెచ్ ని ప్రోత్సహిస్తుంది. దాంతో ఆమ్లత్వం గ్యాస్ ఏర్పడడానికి తగ్గించి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఎంతో బాగా ప్రేరేపిస్తుంది. అలాగే ధనియాలు జీలకర్ర గింజలు పెన్నెల్ గింజలను సమాన పరిమాణంలో తీసుకుని వాటికి కొన్ని నల్ల మిరియాలు కూడా జోడించి దంచండి. ఆ పొడిని టీ స్పూన్ మోతాదులో తీసుకొని నీటిలో వేసి మరిగించి ఆరు ఎనిమిది నిమిషాల పాటు మరిగిన తర్వాత భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు ఆ మిశ్రమాన్ని తాగాలి. అయితే ఈ పొడిని ఒక గాజు సీసాలో పెట్టుకొని నెలల తరబడి నిల్వ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అలాగే కడుపుబ్బరం సమస్యతో బాధపడేవారు మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి.