How to Stop Sneezing: తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా.. అయితే తగ్గించుకోండిలా?

చలికాలం వచ్చింది అంటే రకరకాల ఇన్ఫెక్షన్లు అలర్జీలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది ఎలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలర్జీలతో బాధపడేవారికి తరచ

Published By: HashtagU Telugu Desk
How To Stop Sneezing

How To Stop Sneezing

చలికాలం వచ్చింది అంటే రకరకాల ఇన్ఫెక్షన్లు అలర్జీలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది ఎలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలర్జీలతో బాధపడేవారికి తరచూ తుమ్ములు వేధిస్తూ ఉంటాయి. కొంచెంసేపు మంచులో ఉన్నా గంటపాటు తుమ్ములు అలాగే వస్తూ ఉంటాయి. చల్లగాలి కారణంగా అలర్జీ ట్రిగర్‌ అవుతుంది. దుమ్ము ధూళి, గాలి కాలుష్యం, పూల నుంచి వచ్చే పుప్పొడి, పెంపుడు జంతువుల జుట్టు, చల్లగాలి, చల్లటి నీళ్లు వంటివీ అలర్జీని ప్రేరేపిస్తాయి. ఇలా సరిపడనివేవైనా తగలటం వల్ల ముక్కులోని పొరల్లో అలర్జీ మొదలైతే హిస్టమైన్‌ అనే కెమికల్‌ రిలీజ్‌ అవుతుంది. దీంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లయి ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోయి ఆగకుండా తుమ్ములు వస్తాయి. తుమ్ముల వల్ల ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు.

కొంతమంది తుమ్ములు ఆగడానికి వెంటనే మందులు మింగుతూ ఉంటారు. ఇవి, ఎక్కువగా వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాగా ఒక నివేదిక ప్రకారం విటమిన్ సి యాంటి హిస్టామైన్‌గా పని చేస్తుంది. అలర్జీ, ఇతర కారణాల వల్ల తరచుగా తుమ్ములతో బాధపడేవారు తమ ఆహారంలో విటమిన్‌ సీ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్-సి సిట్రస్ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. ద్రాక్షపండు, నారింజ, కీవీ, నిమ్మ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, టమాటా, జామ, ఉసిరి, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, పాలు, బీట్‌రూట్, ఉసిరి, క్యాబేజీతోపాటు క్యాప్సికమ్ లో విటమిన్‌ సీ మెండుగా ఉంటుంది. మీరు తరచూ తుమ్ములతో బాధపడుతుంటే.. చామంతి టీ గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.

దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. చామంతి టీలో యాంటీ అలర్జీ గూణాలు ఉన్నాయి. మీ జలుబుతో బాధపడుతున్నా చామంతి టీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఒక కప్పులో మరిగించిన నీళ్లు తీసుకొని అందులో చామంతి పువ్వులు వేసి మూడు నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె, పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. మీకు తుమ్ములు ఎక్కువగా వస్తుంటే మీ ముక్కును రెండు వైపులా 5 నుంచి 10 సెకన్ల పాటు మూసి ఉంచాలి. మీకు ముక్కు కారటం తగ్గుతుంది. తుమ్ములు కూడా కంట్రోల్‌ అవుతాయి. మీరు ముక్కుని పట్టుకున్నప్పుడు పైకప్పును చూడాలి. ఇది కొంచెం వింతగా ఉన్నా ఈ టిప్‌ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. మీకు తుమ్ములు ఎక్కువగా వస్తుంటే ఫన్నీ సౌండ్స్‌ చేయండి. ఇది తుమ్ముల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో తుమ్ములు వెంటనే కూడా తగ్గుతాయి.

  Last Updated: 02 Aug 2023, 09:36 PM IST