kidney stones: ఈ ఐదు పదార్థాలు తింటే చాలు కిడ్నీలో రాళ్లు మాయం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. కాకుండా ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ అనేది సర్వసాధ

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 10:00 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. కాకుండా ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కిడ్నీ స్టోన్ అంటే మూత్రంలోని రసాయనాల నుంచి తయారయ్యే ఒక గట్టి పదార్థం. రక్తంలో చాలా వ్యర్థాలు ఉన్నప్పుడు శరీరం తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోతే మూత్రపిండాలలో స్ఫటికాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ స్ఫటికాలు ఇతర వ్యర్థాలు రసాయనాలను ఆకర్షిస్తూ ఘన వస్తువుగా మారుతుంది. మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లకపోతే అది పెద్దదిగా మారుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ప్రతిరోజు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలి. కిడ్నీలు రాళ్లు కరిగించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

వాటితో పాటుగా ఈ ఐదు రకాల పదార్థాలు తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట. మరి ఆ ఐదు రకాల పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డాండెలైన్ ఒక ఆయుర్వేద మూలిక. ఈ మూలిక రసం మూత్ర నాళంలో క్రిస్టల్ డిపాజిట్లను తగ్గిస్తుంది. డాండెలైన్‌ టీను తరచుగా తీసుకుంటే.. మూత్రపిండాల రాళ్లు కరుగుతాయని, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుందని, కిడ్నీ సమస్యల ముప్పును తగ్గిస్తుంది. అలాగే రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఇది రాళ్లను కరిగించడానికి ఎఫెక్టివ్‌, సులభమైన మార్గం అని చెప్పవచ్చు. నీళ్లకు ప్రత్యామ్నాయంగా.. దానిమ్మ రసం, నిమ్మరసం, సూప్‌ వంటి లిక్విడ్‌ ఫుడ్స్‌ తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఈ పానీయాలు చిన్న రాళ్లను బయటకు పంపించేస్తాయి.

అదేవిధంగా తులసి టీలో ఎసిటిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల కారణంగా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. చిన్న సైజ్‌లో ఉన్న రాళ్లను శక్తి ఎసిటిక్‌ యాసిడ్‌కు ఉంది. తులసిలోని యాంటీ లిథియాసిస్ లక్షణాలు రాళ్ల పరిమాణాన్ని విచ్ఛిన్నం చేయడంలో, కుదించడంలో, అవి ఏర్పడకుండా నిరోధిస్తుంది. కిడ్నీలపై ఆక్సీకరణ ఒత్తిడని తగ్గించడానికి యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ప్రభావవంతంగా పనిచేస్తుంది. చెబుతున్నారు. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌ స్థాయిని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. కాల్షియం ఆక్సలేట్ కిడ్నీలో స్టోన్స్‌లో అత్యంత సాధారణ రకం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు రాళ్లను తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే. మీ డైట్‌లో పాలు , పెరుగు, చీజ్ వంటి కాల్షియం రిచ్‌ ఫుడ్స్‌ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. అలాగే గోధుమ గడ్డి రసం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అయితే వీటిని పాటించే ముందు ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.