Site icon HashtagU Telugu

Kidney Health: మీ కిడ్నీ ‘ఆరోగ్యం’గా ఉందా ? లేదా ? ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు!

Kidney

Kidney

Kidney Health: కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. కిడ్నీలు మన రక్తాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా అనేక రకాల ఆరోగ్య సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మందికి తమ కిడ్నీ పాడైపోతుందనే ఆలోచన అస్సలు ఉండదు. అటువంటి పరిస్థితిలో..కిడ్నీ హెల్త్ ను గుర్తించేందుకు దోహదపడే కొన్ని ప్రత్యేక సంకేతాలు, లక్షణాల గురించి మేం ఇవాళ మీకు చెప్పబోతున్నాం.

* చాలా అలసటగా అనిపించడం

చిన్న పని చేస్తున్నప్పుడు కూడా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే.. పనులపై దృష్టి పెట్టలేకపోతే అది బ్యాడ్ సిగ్నల్.  మన కిడ్నీలు సక్రమంగా పనిచేయలేనప్పుడు రక్తంలో విషపదార్థాలు, ధూళి చేరడం మొదలవుతుంది. దీని కారణంగా అలసిపోయి బలహీనంగా మారుతారు.

* పొడి చర్మం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రపిండాలు అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ఇవి మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు మరియు అదనపు ద్రవాన్ని తొలగించే పని చేస్తాయి. ఇందుకు అదనంగా, మూత్రపిండాలు ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. రక్తంలో పోషకాల మొత్తాన్ని నిర్వహిస్తాయి. చర్మం పొడిబారడం, దురద కలగడం అనేవి మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు.

* మూత్రంలో రక్తం

ఆరోగ్యకరమైన మూత్రపిండాలు సాధారణంగా శరీరంలోని రక్త కణాలను సంరక్షించడంలో సహాయపడతాయి. అయితే రక్తం నుంచి వ్యర్థ ఉత్పత్తులను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. కానీ కిడ్నీలోని ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు.. ఈ రక్త కణాలు మూత్రంలోకి రావడం ప్రారంభిస్తాయి.

* మూత్రంలో నురుగు ఏర్పడటం

సాధారణంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు మూత్ర విసర్జన చేసినప్పుడు కొద్దిగా నురుగు ఏర్పడుతుంది. అది కొన్ని సెకన్లలో దానంతటదే మాయమైపోతుంది. అయితే మీ మూత్రంలో నురుగు ఎక్కువగా ఉంటే, అప్పుడు ఈ మూత్రం సూచిస్తుంది.

* కండరాల తిమ్మిరి

సోడియం, కాల్షియం, పొటాషియం లేదా ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయిలలో అసమతుల్యత మీ కండరాలు, నరాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కండరాల తిమ్మిరి, మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* చీలమండలు, పాదాల వాపు

మూత్రపిండాలు శరీరం నుండి సోడియంను సరిగ్గా తొలగించలేనప్పుడు, మీ శరీరంలో ఎక్కువ ద్రవం ఏర్పడుతుంది. దీని కారణంగా, మీ చేతులు, పాదాలు, చీలమండలు లేదా ముఖం మీద వాపు మొదలవుతుంది. మీరు ముఖ్యంగా మీ పాదాలు , చీలమండలపై వాపును గమనించవచ్చు.