అమ్మాయిలు ఉపయోగించే బ్యూటీ ప్రోడక్ట్ లలో లిప్ స్టిక్ కూడా ఒకటి. పెదవులు అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈ లిప్ స్టిక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు లైట్ గా పెదవులకు అప్లై చేస్తే మరి కొందరు మాత్రం డార్క్ గా థిక్కుగా ఎక్కువ మొత్తంలో అప్లై చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లిప్ స్టిక్ ను వారికి తెలియకుండానే కడుపులోకి మింగేస్తున్నారు. నమ్మకపోయినా ఇది అక్షరాల సత్యం అంటున్నారు. క్రమంగా ఇది జీర్ణ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తుందట. లిప్ స్టిక్ వాడే మోతాదును బట్టి సంఖ్యను బట్టి అనారోగ్య సమస్యలు తీవ్రత ఉంటుందని చెబుతున్నారు.
లిప్ స్టిక్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయట. కొన్ని రకాల లిప్ స్టిక్ లో 10 పిపిఎం సీసం ఉంటుంది. ఇంత స్థాయిలో సీసం ఉంటే అది చాలా ప్రమాదం. ఇది మూత్ర పిండాలు, ఎముకలు, క్యాన్సర్ వంటి వ్యాధులకి కారణం అవుతుంది. మరికొందరికి గైనిక్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలట. అంతేకాకుండా చాలామంది ఆడవాళ్ళు కొందరు నాసిరకం లిప్ స్టిక్ ని వాడుతున్నారు. దీనిలో ఎక్కువగా బ్యాడ్ కెమికల్స్ ఉపయోగిస్తారు. దీనివల్ల నాడి వ్యవస్థపై ప్రభావం పడుతుందట..అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుందట.
హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అడుగుతున్నారు. అలాగే ఇది పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. లిప్ స్టిక్ లోని రసాయన మూలకాలు చర్మ సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. మీది సున్నితమైన చర్మం అయినట్లయితే వీలైనంత మటుకు లిప్ స్టిక్ ని ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇందులో ఉండే పాలిథిలిన్ మీ నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుందట. కాబట్టి లిప్ స్టిక్ కొనేటప్పుడు అందులో ఎంత పాలిథిలిన్ ఉందో గమనించాలి. ఎక్కువ పాలిథిలిన్ ఉన్నట్లయితే ఆ లిప్ స్టిక్ కొనడం మానేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో లిప్ స్టిక్ వేసుకోవాల్సి వస్తే ముందుగా పెదాలకి పెట్రోలియం జెల్లీ రాయాలి. అది మీ పెదాలను రక్షించడంలో సహాయపడుతుంది.