కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబందను తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు అందానికి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి అంటున్నారు నిపుణులు. కలబంద జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే కలబంద జుట్టుకు అప్లై చేస్తే జిడ్డుగా మారుతుందని, ఎన్నిసార్లు స్నానం చేసిన సరిగా పోదని అంటూ ఉంటారు.
మరి నిజంగానే కలబంద జుట్టుకు అప్లై చేస్తే జుట్టు జిడ్డుగా మారుతుందా,ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబందను జుట్టుకు అప్లై చేయడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా అప్లై చేస్తే మాత్రం సమస్యలు తప్పవట. కలబంద జెల్ ను నెత్తికి అప్లై చేయడం వల్ల నెత్తిమీదున్న చుండ్రు పోతుంది. దురద కూడా తగ్గుతుంది. అయితే దీన్ని మోతాదుకు మించి నెత్తికి పెడితే కూడా తలపై దురద, బర్నింగ్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు కలబంద జెల్ ను నెత్తిమీద అప్లై చేయడం వల్ల నెత్తిమీద క్రస్ట్ లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిపై మనం దృష్టి పెట్టం. దీనివల్ల ఇవి బాగా పెరుగుతాయి. ఇది మీ నెత్తి దెబ్బతినడానికి కారణమవుతుందని చెబుతున్నారు.
అదేవిధంగా కలబందను ఎక్కువగా వాడడం వల్ల జలుబు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే కలబందలో చలువ చేసే గుణం ఉంటుంది. దీనితలకు ఎక్కువగా అప్లై చేస్తే జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. కలబంద జెల్ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని వాడటం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. మృదువుగా మారుతుంది. కానీ కొన్నిసార్లు దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగల జుట్టు ఉన్నవారు కలబంద జెల్ వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే కలబంద మంచిదే కదా అని ఎక్కువగా వాడితే మాత్రం తలపై బొబ్బలు వంటి సమస్యలు వస్తాయట. కలబందను ఉపయోగించాలి అనుకున్న వారు తక్కువ మోతాదులో వారానికి ఒకటి లేదా రెండుసార్లు కంటే ఎక్కువసార్లు ఉపయోగించకపోవడం మంచిదని చెబుతున్నారు.
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.