Paracetamol Side Effects: నడుము నొప్పికి పారాసిటమాల్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్.. రీసెర్చ్ రిపోర్ట్

పారాసెటమాల్ ను చాలామంది సర్వ రోగ నివారిణిలా వాడేస్తుంటారు.. ఏ ప్రాబ్లమ్ వచ్చినా పుట్నాలు, బఠాణీల్లా పారాసెటమాల్ ను తినేస్తుంటారు..

Paracetamol : పారాసెటమాల్ ను చాలామంది సర్వ రోగ నివారిణిలా వాడేస్తుంటారు.. ఏ ప్రాబ్లమ్ వచ్చినా పుట్నాలు, బఠాణీల్లా పారాసెటమాల్ ను తినేస్తుంటారు.. కొంతమంది నడుము నొప్పి కోసం కూడా పారాసెటమాల్ (Paracetamol) వాడుతుంటారు ? దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నడుము నొప్పి ప్రాబ్లమ్ చాలామందికి ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు నిలబడటం లేదా నేరుగా కూర్చోవడం కూడా కష్టతరం అవుతుంది. ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందడానికి ప్రజలు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పారా సెటమాల్, ఇబుప్రోఫెన్, కోడైన్ వంటి మందులను వాడుతుంటారు. నడుము నొప్పి ఉన్నవాళ్లు అటువంటి మందులను వాడటం మంచిది కాదని లేటెస్ట్ రీసెర్చ్ లో వెల్లడైంది. 15,134  మందిపై జరిపిన అధ్యయనంలో ఈవిషయం తేలింది. 69 రకాల మందుల కాంబినేషన్లపై ఈ స్టడీ జరిగింది. వాటితో 13 క్లినికల్ ట్రయల్స్ చేశారు. 2015 సంవత్సరం నాటి ఆ స్టడీ రిపోర్ట్ లను తాజాగా రివ్యూ చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు.. వారు గుర్తించిన వివరాలతో మరో ప్రత్యేక రిపోర్ట్ ను విడుదల చేశారు. వెన్నునొప్పి మరియు ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స కోసం పారాసెటమాల్ సహాయపడలేదని తేల్చారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఈ స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది.

నడుము నొప్పికి పారాసెటమాల్ (Paracetamol) వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇవీ

  1. జీర్ణాశయాంతర వ్యవస్థపై దుష్ప్రభావాల విషయానికి వస్తే.. వికారం, అజీర్తి, వాంతులు మరియు విరేచనాలు అవుతాయి.
  2. నాడీ వ్యవస్థకు సంబంధించిన అసౌకర్యాలలో మగత, మైకము మరియు తలనొప్పి కలుగుతాయి.
  3. కాలేయం వైపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నడుము నొప్పిని ఎలా తగ్గించాలి?

పారాసెటమాల్‌ నడుము నొప్పిని తగ్గించడంలో తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నొప్పి తగ్గాలంటే శారీరక శ్రమే కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  తక్కువ వెన్నునొప్పి ఉన్నవారు కదలకూడదనే చాలా సాధారణ అపోహ ఉంది. అయితే, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మీరు ఎంత ఎక్కువ కదులుతారో, శారీరకంగా ఎంత చురుకుగా ఉంటారో అంత తక్కువ నొప్పిని ఫీల్ అవుతారు. ఎక్కువసేపు కూర్చోవడం మరియు కదలకుండా ఉండటం వల్ల వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలు బలహీన పడతాయి. తద్వారా అవి తన పట్టును కోల్పోతాయి.

Also Read:  Navratri: మహా అష్టమి, మహా నవమి తేదీలు, శుభ ముహూర్తం వివరాలివీ..