Site icon HashtagU Telugu

Health Tips: రాత్రిళ్ళు ఫోన్ ని తెగ ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త!

Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పగలు పనులకు వెళ్లేవారు రాత్రిపూట ఎక్కువసేపు మొబైల్ చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరూ అర్ధరాత్రి దాటినా కూడా ఇంకా మొబైల్ ఫోన్లు చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కువ సేపు చూడటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.

మరి రాత్రిపూట మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మీ కళ్లను దెబ్బతీస్తుంది. అలాగే మీ నిద్ర దెబ్బతింటుంది. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడటం వల్ల రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. దీంతో మీ డే అంతా గజిబిజిగా, ఒత్తిడిగా మారుతుంది. అలాగే గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ చేతులు, భుజం కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. మొబైల్ ఫోన్ ను యూజ్ చేయడానికి ఒక సమయాన్ని సెస్ చేసుకోండి. అంటే రాత్రి పది గంటల తర్వాత నెట్ ను ఆఫ్ చేయాలనే రూల్ పెట్టుకోవడం వల్ల మీకు ఒకటి లేదా రెండు వారాలు కష్టంగా రోజులు గడుస్తాయి. మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. చేతులు ఖాళీగా కూడా అనిపిస్తాయి. కానీ ఇది అలవాటైన తర్వాత మీరు ఎంతో ప్రశాంతంగా, తొందరగా నిద్రపోతారు.

దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. నెట్ ఆన్ లో ఉన్నప్పుడు తరచూ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దాంతో తెలియకుండా మొబైల్ ఫోను ఎక్కువ సేపు వినియోగిస్తూ ఉంటాం. మొబైల్ లో మెసేజ్ టోన్ మోగగానే ఏమోచ్చందని వెంటనే చెక్ చేస్తారు. దాన్ని చూడాలనే ఇష్టం మీకు లేకపోయినా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. అందుకే నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం మంచిది. అలాగే అనవసరమైన సోషల్ మీడియా యాప్స్ ను డిలీట్ చేయడం మంచిది. అలాగే మీరు మొబైల్ లో స్క్రోల్ చేసేటప్పుడు స్క్రీన్ బ్రైట్ నెస్ ను పూర్తిగా తగ్గించడం మంచిది. దీంతో మీ కళ్లపై ఎక్కువ ప్రభావం పడదు. అలాగే పడుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం వారితో కలిసి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయడం లాంటివి చేయడం వల్ల మొబైల్ ఫోన్ పై మీకు దృష్టి పోదు.