Site icon HashtagU Telugu

Ear Phones: గంటల తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Ear Phones

Ear Phones

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వాడకంతో పాటుగా ఇయర్ ఫోన్స్, బ్లూటూత్, ఇయర్ బర్డ్స్ బడ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే కంటిన్యూస్ గా కొన్ని గంటల తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ కాల్స్ మాట్లాడటం లేదంటే పాటలు వినడం లాంటివి చేస్తూ ఉంటారు. పని చేయడానికి, మ్యూజిక్ వినాలన్నా, సినిమా చూడాలన్నా.. ఇయర్ ఫోన్స్ వాడేస్తున్నారు. చాలా మంది ప్రజలు పట్టణ శబ్దాన్ని నివారించడానికి లేదా ఫ్యాషన్‌గా ఉండటానికి హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌బడ్‌ లను ఉపయోగిస్తారు. ఆఫీస్ అయినా, కాలేజీ అయినా, ప్రయాణం అయినా, హెడ్ ఫోన్స్ అయినా, ఇయర్ ఫోన్ అయినా, ఇయర్ బడ్స్ అయినా అందరికీ తోడుగా మారతాయి.

బయటికి వెళ్తే చాలు కచ్చితంగా చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. గంటల తరబడి హెడ్ ఫోన్ లను వినియోగించడం అంత మంచిది కాదని చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎక్కువసేపు వినియోగించడం వల్ల అవి మీ చెవుల పై చెడు ప్రభావం చూపిస్తాయి. క్రమంగా చెవులు పనిచేయకుండా పోవడం చెవులకు సంబంధించిన సమస్యలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే బేస్ ఎక్కువగా పాటలు వినడం సినిమాలు చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఒక వయసు వచ్చేసరికి చాలామందికి వినికిడి లోపం ఏర్పడుతోంది.

ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల ద్వారా బిగ్గరగా సంగీతం వినడం మీ వినికిడిని ప్రభావితం చేస్తుంది. చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ మాత్రమే, కానీ నిరంతరం వినడం ద్వారా 40 నుంచి 50 డెసిబుల్స్ తగ్గించవచ్చు. అలాగే గంటల తరబడి హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినడం చెవులకు, గుండెకు మంచిది కాదు. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకోవడమే కాకుండా గుండెకు మరింత హాని కలుగుతుంది. హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్ సమస్యకు కారణమవుతుంది. చాలామంది నిద్రలేమి, నిద్రలేమి, నిద్రలేమి లేదా స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు.

మరి ముఖ్యంగా ఇయర్‌ ఫోన్‌ లను నేరుగా చెవిలో ఉంచుతారు. ఇది వాయుమార్గాన్ని కూడా అడ్డుకుంటుంది. ఈ అడ్డంకి బ్యాక్టీరియా పెరుగుదలతో సహా వివిధ రకాల చెవి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. హెడ్‌ఫోన్‌ లను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల వ్యక్తి సామాజిక జీవితం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఇది అధిక ఆందోళన , ఒత్తిడిని కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే వాహనాలలో ప్రయాణించేటప్పుడు ఇయర్ ఫోన్స్ ని ఉపయోగించడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.