ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ ఫోన్లతో పాటు ఇయర్ బర్డ్స్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వంటి వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీసులలో ఉద్యోగాలు చేసేవారు యువత ఎవరు చూసినా కూడా వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీటిని చెవులలో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఫ్యాషన్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఎలాంటి శబ్దాలు లేకుండా వాయిస్ క్లారిటీగా వినడం కోసం ఈ హెడ్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వంటివి ఉపయోగిస్తున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి ఉపయోగిస్తే పర్లేదు కానీ కొంతమంది గంటల తరబడి వీటిని వినియోగిస్తూ ఉంటారు.
అయితే మితిమీరిన వినియోగం అంత పనికిరాదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల చెవులపై చెడు ప్రభావం పడటం మాత్రమే కాకుండా తీవ్రమైన హాని కూడా కలిగిస్తుందట. ఇయర్‌ఫోన్ ల నుండి వచ్చే సంగీతం మీ ఇయర్ డ్రమ్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుందట. అలాగే ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కొంతమంది బేస్ ఎక్కువగా సౌండ్ ఎక్కువగా వింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. క్రమంగా ఇలా చేస్తూ ఉండటం వల్ల వినికిడి లోపం వస్తుందట. ఇయర్‌ఫోన్ లు లేదా హెడ్‌ఫోన్ ల ద్వారా గట్టిగా మ్యూజిక్ వినడం అన్నది మీ వినికిడిని ప్రభావితం చేస్తుందట. అలాగే చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ మాత్రమే, కానీ నిరంతరం వినడం ద్వారా 40 50 డెసిబుల్స్ తగ్గించవచ్చట.
దీని ద్వారా వినికిడి లోపం వస్తుందని చెబుతున్నారు. గంటల తరబడి హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినడం చెవులకు, గుండెకు మంచిది కాదట. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకోవడమే కాకుండా గుండెకు మరింత హాని కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్ ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపిస్తాయట. ఇది తలనొప్పి, మైగ్రేన్ సమస్యకు కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే చాలామంది నిద్రలేమి, లేదా స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారట. ఇయర్‌ఫోన్ లను నేరుగా చెవిలో ఉంచడం వల్ల ఇది వాయు మార్గాన్ని అడ్డుకుంటుందట. ఈ అడ్డంకి బ్యాక్టీరియా పెరుగుదలతో సహా వివిధ రకాల చెవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే హెడ్ ఫోన్స్ అధికంగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానం ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయట.