Health Tips: రాత్రిపూట తలస్నానం చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కంటి నిండా సరిగ్గా నిద్రపోక, కడుపునిండా భోజనం చేయక

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కంటి నిండా సరిగ్గా నిద్రపోక, కడుపునిండా భోజనం చేయక కెరియర్ అంటూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. పగలు అంతా కష్టపడి పనిచేసి రాత్రి అనగా ఇంటికి వస్తున్నారు. ఉదయం సమయంలో అనేక కారణాల వల్ల చాలామంది స్నానం చేయడం కుదరక రాత్రి సమయంలో స్నానం చేస్తూ ఉంటారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తల స్నానం చేసి పడుకుంటూ ఉంటారు. అయితే చాలామంది అది మంచిపని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే రాత్రి సమయంలో తల స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రిపూట తలస్నానం చేస్తే అనేక జుట్టు సమస్యలు వస్తాయి. రాత్రి సమయాల్లో తలస్నానం చేస్తే తడి వెంట్రుకలను దువ్వడం వల్ల జుట్టు బలహీన పడటంతో పాటుగా జుట్టు రాల సమస్య కూడా ఎక్కువగా అవుతుంది. తల స్నానం చేసి జుట్టు సరిగ్గా ఆరబెట్టుకోకుండా బెడ్ మీద పడుకోవడం వల్ల బెడ్ కు పిల్లోకు వెంట్రుకలు అతుక్కుపోతాయి. అలా చేయడం వల్ల జుట్టు మరింత చిక్కుబడి తల దువ్వినప్పుడు మరింత ఎక్కువగా రాలుతుంది. క్రమంగా హెయిర్ ఫాల్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే తడిజుట్టుతో పడుకోవడం వల్ల చుండ్రు, ఇన్ఫెక్షన్ల సమస్యలు కూడా వస్తాయి. రాత్రి సమయంలో తొందరగా జుట్టు ఆరాలని టవల్ తో గట్టిగ తుడిస్తే జుట్టు కుదుళ్ళు బలహీనం అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది.

అలాగే జుట్టు మెరుపును కూడా కోల్పోతుంది. తడి జుట్టు దువ్వితే వెంట్రుకలు బలహీనం అయ్యి ఊడిపోతుంది. నెమ్మదిగా జుట్టును ఆరబెట్టుకుంటే మంచిది అని అంటున్నారు. ఒకవేళ రాత్రిపూట తలస్నానం చేసిన నెమ్మదిగా జుట్టును ఆరబెట్టుకుని అప్పుడు పడుకొని నిద్రపోవాలి. అలాగే చాలామంది తిన్న తర్వాత పడుకునే ముందు స్నానం చేసి అలాగే నిద్రపోతూ ఉంటారు. అలా చేయకూడదు. మొదట స్నానం చేసి ఆ తర్వాత తిని పడుకోవడం వల్ల తన స్నానం చేసిన కొద్దిగా ఆరడానికి సమయం ఉంటుంది.