Site icon HashtagU Telugu

Sprouts: మొలకలు ఆరోగ్యానికి మంచివే కానీ..అతిగా తింటే మాత్రం అంతే సంగతులు?

Sprouts

Sprouts

ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం కాయగూరలు, పండ్లు,మాంసాహారాలు ఇలా మంచి మంచి పోషకాహారాలు ఉండేవి మాత్రమే తీసుకోవాలి. అలాగే మొలకెత్తిన గింజలలో కూడా అనేక రకాల విటమిన్లు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే మొలకెత్తిన గింజలు తినడం మంచిది కానీ అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. మరి మొలకెత్తిన గింజలు అతిగా తినడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొలకెత్తిన పెసరపప్పు లో విటమిన్ ఏ,విటమిన్ చ్, ఫైబర్ పొటాషియం ఫాస్ఫరస్ లాంటి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే మొలకెత్తిన పెసర్లలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మన శరీరం అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు. దీంతో కడుపుబ్బరం ఎసిడిటీ మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మొలకెత్తిన పెసర పప్పులో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.ముడి లేదా వండని ధాన్యాలు ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ , పిల్లలు, వృద్ధులతో సహా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి మొలకలు ఫుడ్ పాయిజన్ కు దారితీస్తాయి.

ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే ఇస్తున్నతమైన గట్ ఉన్నవారు ఈ మొలకెత్తిన గింజలను తినక పోవడమే మంచిది. ఈ మొలకెత్తిన గింజలు అంత సులభంగా జీర్ణం కాకపోవడంతో పాటు కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలకు దారితీస్తుంది.అలాగే పైల్స్ సమస్యతో బాధపడేవారు పచ్చి పెసరపప్పును తింటే పరిస్థితి మరింత ముదురుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు కూడా ఈ మొలకెత్తిన గింజలు తినకపోవడం మంచిది. కఫం సమస్య ఉన్నవారు కూడా మొలకలను సులువుగా జీర్ణించుకోగలుగుతారు. కానీ వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ సార్లు అస్సలు తినకూడదు.

Exit mobile version