Site icon HashtagU Telugu

Health Tips: టాయిలెట్ లో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు రావడం ఖాయం!

Health Tips

Health Tips

మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాం అన్న విషయాలు కూడా పూర్తిగా మర్చిపోతున్నారు. భోజనం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చివరికి బాత్రూంలో ఉన్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ లోనే వినియోగిస్తున్నారు. చేయాల్సిన పనుల గురించి పక్కనపెట్టి గంటల తరబడి మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ ఉంటారు. అందరూ బాత్రూంలో కూడా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ గంటల తరబడి అక్కడే కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట. మరి టాయిలెట్ లో ఎక్కువ సేపు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ సమస్య వస్తుందని చెబుతున్నారు. టాయిలెట్ సీటులో కూర్చోవడం వల్ల మలద్వారం పై ఒత్తిడి బాగా పడుతుందట. దీని వల్ల వాపు, గడ్డలు అవుతాయట. ఈ ముద్దలు హేమోరాయిడ్స్ గా మారుతాయని,అందుకే ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు.

అలాగే మరుగుదొడ్డి లోపల సీటుపై ఎన్నో రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందట. ఇవి అంటు వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తాయట. ముఖ్యంగా మొబైల్ లేదా న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మొబైల్, పేపర్ కు అంటుకుంటుందట. దీనివల్ల సంక్రమణ వచ్చే ప్రమాదం ఉందట. అందుకే టాయిలెట్ లోకి మొబైల్ ను తీసుకెళ్లకూడదని చెబుతున్నారు.

అలాగే పొట్టను శుభ్రం చేసుకోవడానికి టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చుంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే అని చెబుతున్నారు. నిజానికి టాయిలెట్ సీట్ లో ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల మీ పొట్టపై ఒత్తిడి బాగా పడుతుందట. దీనివల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. టాయిలెట్ సీటుపై ఒకే పొజీషన్ లో ఎక్కువ సేపు కూర్చుంటే దిగువ వీపుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల పాదాలలో వాపు, జలదరింపు, పాదాల తిమ్మిరి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.