Site icon HashtagU Telugu

Skip Dinner: రాత్రి పూట తినడం లేదా.. అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే!

Skip Dinner

Skip Dinner

మనలో చాలామంది రాత్రిపూట తినడం మానేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో తినకుండా ఏవో చిన్న చిన్న ఆహార పదార్థాలు తిని అలాగే పడుకుంటూ ఉంటారు. అంటే నైట్ పూట ఆహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. కానీ అలా అస్సలు చేయకూడదని వైద్యులు చెబుతుంటారు. ఒకవేళ రాత్రిపూట డిన్నర్ ని స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..బరువు తగ్గుతామని రాత్రిపూట తినకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్టే అని చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట తినకపోవడం వల్ల మీ శరీరంలో పోషకాహార లోపాలు ఏర్పడతాయట. అంటే మీరు పోషకాహార లోపానికి గురవుతారన్న మాట.

అయితే ఇది మీ శారీరక విధులను ప్రభావితం చేస్తుందని,దీనివల్ల మీరు బలహీనంగా మారుతారని, అలాగే రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట తినకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక చెడు అలవాటు అంటున్నారు. చాలామంది రాత్రిపూట తినకుండా ఉంటే బరువు తగ్గుతారని అపోహ పడుతూ ఉంటారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు శారీరక శ్రమ చేయకపోయినా మన మెదడు పనిచేస్తుంది. దీనివల్ల మరుసటి రోజు మీరు బలహీనంగా ఉంటారు. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుందట. కొన్ని కొన్ని సార్లు లేవడానికి కూడా మీరు బద్దకిస్తూ ఉంటారు.

అలా రాత్రిపూట తినని వారి ఉదయాన్నే కొంచెం అర్లిగా ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం అసలు మంచిది కాదట. రాత్రిపూట తినకపోవడం వల్ల సరిగ్గా నిద్రరాదు. అలాగే రోజు మీరు బద్ధకం, అలసటగా భావిస్తారు. కాబట్టి ఎట్టిపరిస్థితిలో డిన్నర్ ను స్కిప్ చేయొద్దు అని చెబుతున్నారు వైద్యులు. అలాగే మీరు రాత్రి భోజనం చేయడం మానేస్తే అది మీ జీర్ణవ్యవస్థను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందట. జీర్ణక్రియ విఫలమైతే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని, కాబట్టి మర్చిపోకుండా డిన్నర్ చేయాలనీ చెబుతున్నారు. దీనివల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. సరైన ఆహారం, నిద్ర మన రోజును మరింత ఆనందంగా ఉంచుతాయి. అలాగే మన జీవనశైలిని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.