Site icon HashtagU Telugu

Sitting: ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే?

Sitting

Sitting

ఇటీవల కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు గల కారణం ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం. ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు అలాగే సిస్టమ్ ముందు కూర్చుని పని చేసేవాళ్ళు గంటలు తరబడి ఒకే ప్రదేశంలో కూర్చొని ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ సమస్య తలెత్తవచ్చు. కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే కాకుండా చాలామంది ఇంట్లో కాలక్షేపం చేసే వాళ్ళు మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే ఒకే ప్రదేశంలో కూర్చొని ఉంటారు.

అయితే ఎక్కువసేపు అలాగే ప్రదేశంలో కూర్చోకుండా గంటలో ఐదు నుంచి పది నిమిషాలు అలా వాకింగ్ చేయడంతో పాటు చేతులను పైకి కిందకు అంటూ ఉండాలి. చేతులు, కాళ్లను సాధ్యం అయినంతగా ఎక్కువ కదిలించడం వల్ల ముందు సమస్యలు ఉండవు. అనారోగ్య సమస్యలకు కారణం అయిన కంటిన్యూస్‌ సిట్టింగ్‌ గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా కారణం అవుతుంది. గంటల తరబడి కాళ్లు, చేతులు ముడుచుకొని కూర్చుని ఉండటం వల్ల రక్త ప్రసరణ ఎక్కడికి అక్కడ స్థంభించి పోతుంది. తద్వార గుండె సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కూర్చొని జాబ్‌ చేసే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో లేచి నిలబడి కాళ్లు చేతులు మూమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

లేదు అంటే అలా ఒకసారి ఐదు నిమిషాల పాటు నడవడం మంచిది. కరోనా మహమ్మారి తర్వాత చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఎనిమిది గంటలకు మించి వర్క్ చేస్తున్నారు. వర్క్ ఎక్కువ కావడంతో ఇంట్లో కూడా గంటల తరబడి ఇష్టముందు అలాగే కూర్చుంటున్నారు. అలా కాకుండా ప్రతి గంటకు ఒకసారి అలా లేచి తిరగడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలుగా కూర్చుని జాబ్ చేస్తున్నా వారిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరపగా మొదట నడుము నొప్పి అని కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు గుండెలకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా గంట గంటకు విశ్రాంతి పేరుతో కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కనుక మీరు కనుక ఎక్కువ సమయం కూర్చుని చేసే జాబ్‌ చేస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పిన విధంగా గంటకు అయిదు పది నిమిషాలు కనీసం వాకింగ్‌ చేయాలి. అందుకే చాలామంది కంపెనీల్లో అలా టీ తాగడానికి బయటకు వెళ్తూ ఉంటారు.