Site icon HashtagU Telugu

Health Tips: ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

Health Tips

Health Tips

మామూలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు ఆఫీసులలో పని చేసేవారు గంటలకు కొద్దిగా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఉంటారు. కొంతమంది మధ్యలో టీ బ్రేక్ అంటూ లేచి అలా కొద్దిసేపు నడుస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అలాగే కూర్చుని పని చేస్తూ ఉంటారు. అయితే ఇలా కూర్చొని పని చేస్తే కేవలం నడుముకు సంబంధించిన సమస్యలతో పాటు వెన్ను సమస్యలు మాత్రమే వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుందట. ఇది దీర్ఘకాలిక ప్రభావాన్నిచూపుతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కేవలం వెన్నెముక, వీపునకు సంబంధించిన సమస్యలనే కాకుండా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుందట. మీ కండరాలు కదులుతున్నప్పుడు లిపోప్రొటీన్ లిఫేజ్ లాంటి అణువులను విడుదల చేస్తుందట. ఇది మీరు తినే కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుందట. అయితే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ అణువుల విడుదల తగ్గుతుందట. మీరు ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందట. అందుకే ఎక్కువగా కూర్చునే వారు ఒక గంటపాటైనా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయట. ముఖ్యంగా ఇలా కూర్చోవడం వల్ల మీ కాళ్లు, పిరుదులు, మీ వీపు ఎక్కువగా ప్రభావితం అవుతాయట. అలాగే ఈ భాగాల కండరాలు బాగా నొప్పి పెడతాయట. అలాగే అసౌకర్యంగా కూడా ఉంటుందట.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీ హిప్ కూడా వంగుతుందట. అలాగే మీరు కూర్చున్న స్థానం కూడా మీ వెనుకకు గాయాన్ని చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా చెడు భంగిమలో కూర్చున్నా, సరైన కుర్చీని ఉపయోగించకపోయినా మీ ఎముకలు బలహీనపడతాయట. అలాగే ఎముకల పగుళ్లు వస్తాయని చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ బాహ్య శరీర కూర్పు దెబ్బతినడమే కాకుండా మీ గుండె వంటి అవయవాల పనితీరుపై కూడా ఎంతో ప్రభావం పడుతుందట. 11 గంటల పాటు టీవీ చూసే పురుషులతో పోలిస్తే వారానికి 23 గంటల కంటే ఎక్కువ చూసే పురుషులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 64 శాతం ఎక్కువగా ఉంటుందట.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లలో రక్తం, ద్రవాలు పేరుకుపోతాయట. దీనివల్ల కాళ్లలో అలసట, వాపు, నొప్పి కలుగుతాయి. కొన్నిసందర్బాల్లో కాళు సిరలో రక్తం గడ్డకట్టినప్పుడు మీకు సిర సమస్యలు రావొచ్చు. ఇది ప్రమాదకరం. అలాగే గర్భిణీలు లేదా వృద్ధులు, స్మోకింగ్ చేసేవారికి ఎక్కువ ఈ ప్రమాదం ఉంటుందట. కాబట్టి ఎక్కువసేపు కూర్చొని పని చేసేవారు అలాగే కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి అలా తిరుగుతూ ఉండాలని అప్పుడే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు.