Site icon HashtagU Telugu

Jamun Fruit : అల్ల నేరేడు పండ్లను ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 25 Jan 2024 02 51 Pm 1662

Mixcollage 25 Jan 2024 02 51 Pm 1662

మామూలుగా నేరేడు పండును చూస్తే చాలు మనకు వెంటనే నోరూరిపోతూ ఉంటుంది. ఇవి మనకు ఎండాకాలం ముగిసే సమయంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి నల్లగా నీలం రంగు కలర్ లో నిగనిగలాడుతూ ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ నల్ల నేరేడు పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నేరేడు పండ్లు వాటి లోపల విత్తనాల వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ఈ వీటి దర కాస్త ఎక్కువే అయినప్పటికీ వీటి వల్ల కలిగే లాభాలు మాత్రం ఎన్నో. అయితే వీటిని చాలామంది మళ్లీ దొరుకుతాయో దొరకవో అన్నట్టుగా ఎక్కువగా తింటూ ఉంటారు.

కానీ అలా తింటే మాత్రం కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిందే. మరి నేరేడు పండ్లను ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామందిని ప్రస్తుతం హైబీపీ సమస్య వేధిస్తోంది. హైబీపీ ఉన్నవాళ్లు నేరేడు పండ్లను అధికంగా తీసుకుంటే హైబీపీ కాస్త లోబీపీ అయిపోతుందట. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ను నేరేడు ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను చాలా మితంగా తీసుకోవాలి. ఏమాత్రం ఎక్కువైనా బీపీ తక్కువైపోతుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా అల్ల నేరేడు పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.

అదే పనిగా అల్లనేరేడు పండ్లను తింటే మలబద్ధకం సమస్య ఇంకా ఎక్కువవుతుంది. దానికి కారణం అందులో ఉండే విటమిన్ సి. అది మలబద్ధకం సమస్యను ఇంకా పెంచుతుంది. అలాగే మీకు మొటిమలు ఎక్కువగా ఉంటే అల్ల నేరేడు పండ్లకు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే నేరేడు పండ్లను ఎక్కువగా తింటే మొటిమలు రావడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. మొటిమలు లేనివాళ్లకు కూడా మొటిమలు వస్తాయి. అందుకే ఎక్కువగా నేరేడు పండ్లను తినకూడదంటారు. నేరేడు పండ్ల వాసన కొంచెం వెరైటీగా ఉంటుంది. వాటి వాసన చూస్తేనే వికారం వస్తుంది. అలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్ల నేరేడు పండ్లను తినకపోవడమే మేలు. వాటి వాసన పడని వాళ్లు వాటిని తింటే వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది.