Diabetes: మధుమేహం ఉన్నవారు అల్లం తింటే ఇన్ని సమస్యలు వస్తాయా.. వామ్మో?

ప్రతి ఒక్క వంటింట్లో ఉండే దివ్య ఔషధాలలో అల్లం కూడా ఒకటి. అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 09:10 AM IST

ప్రతి ఒక్క వంటింట్లో ఉండే దివ్య ఔషధాలలో అల్లం కూడా ఒకటి. అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలానే ఎక్కువగా కూరలో రుచి కోసం వాసన కోసం వినియోగిస్తూ ఉంటారు. అయితే అల్లం జీర్ణ సమస్యలతో పాటు, జలుబు దగ్గు లాంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అలాగే వికారంగా వాంతులుగా ఉన్నా కూడా అల్లం అటువంటి వాటికీ చెక్ పెట్టేస్తుంది. అలాగే దంత సమస్యలు, నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు అల్లాన్ని తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది.

అల్లం లో సహజ సిద్ధమైన యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉంటాయి. అల్లం వల్ల కీళ్ల నొప్పులు,వాపులు తదితర సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని వ్యక్త పదార్థాలను బయటకు పంపే గుణం అల్లం లో ఉంది. ఊపిరితిత్తుల సమస్యలకు కూడా అల్లం చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అలా అని మరి అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. అల్లం ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.

అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అల్లం ని ఎక్కువగా తీసుకోకూడదు అని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే మధుమేహం ఉన్నవారు అల్లం తినవచ్చా లేదా అన్న విషయానికి వస్తే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లం రక్త పీడనానికి కారణమై అలసటను కలిగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు వైద్యుల సలహా మేరకు మాత్రమే అల్లాన్ని తీసుకోవడం మంచిది. చాలావరకు డయాబెటిస్ వారు అల్లాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.