Site icon HashtagU Telugu

Watermelon Side Effects: వేసవిలో పుచ్చకాయ అధికంగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Watermelon Side Effects

Watermelon Side Effects

వేసవిలో మనకు ఎక్కువగా దొరికే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఈ పుచ్చకాయ వేసవికాలంలో తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ , సీ లకు గొప్ప మూలం. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అయితే వేసవిలో పుచ్చకాయలను తినడం మంచిదే కానీ మితిమీరి తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబందిత సమస్యలు తలెత్తుతాయి. పొత్తికడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు ఏర్పడవచ్చు. ఫ్రక్టోజ్ కంటెంట్ కారణంగా పోషకాహార నిపుణులు పుచ్చకాయను అధిక FODMAP ఆహారంగా భావిస్తారు. ఫ్రక్టోజ్ అనేది మోనోశాకరైడ్. దీనిని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. పుచ్చకాయను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కాబట్టి మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మితిమీరి తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్లు ప్రమాదంలో పడతారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అయితే కొద్ది మొత్తంలో తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అతిగా తింటేనే సమస్య. పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి పడిపోతుంది. తక్కువ రక్తపోటు ఉన్న వారు ఎక్కువ మొత్తంలోని తిన్నా దుష్ప్రభావం కనిపించదు. కానీ బీపీ ఎక్కువగా ఉన్న వారు పుచ్చకాయను అతిగా తింటే రక్తపోటు పడిపోతుంది. గర్భధారణ మధుమేహం అనేది చాలా మంది గర్భిణీలను వేధించే సాధారణ సమస్య. గర్భంతో ఉన్న వారు పుచ్చకాయలను పెద్ద మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది గర్భాధారణ మధుమేహానికి దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు గ్యాస్టేషనల్ డయాబెటిక్స్ కు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే పుచ్చకాయను తినకపోవడమే మంచిది.

Exit mobile version