చలికాలం నెమ్మదిగా తగ్గుతోంది. కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే చలి తీవ్రత అలాగే ఉంది. ఇంకొన్ని ప్రదేశాలలో సూర్యుడు మధ్యాహ్నం సమయంలో ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వేసవి కాలానికి ఇంకా సమయం ఉండగానే అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే వేసవి కాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. అటువంటి వాటిలో కోడిగుడ్లు కూడా ఒకటి. అయితే వేసవికాలంలో కోడిగుడ్లు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే వైద్యులు ఒక కోడిగుడ్డుని తినాలని చెబుతూ ఉంటారు. అయితే కోడి గుడ్డును వేసవికాలంలో ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు. వేడి ఎక్కువగా ఉన్న రోజులలో ఎక్కువ గుడ్లు తినకూడదు అని చెబుతున్నారు. వేసవిలో కోడిగుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. గుడ్డులోని తెల్లసొనతో చాలా మందికి అలెర్జీ ఉంటుంది. రోజుకు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
అలాగే దద్దుర్లు శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. డయేరియా ట్రాప్ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా గుడ్లలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ గుడ్లను బాగా ఉడకబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవి కాలంలో చాలా మంది కోడిగుడ్డును ఎక్కువగా ఉడకబెట్టకుండా అలాగే తింటూ ఉంటారు. దీనివల్ల ఆ వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయట. అయితే వేసవిలో కోడిగుడ్లు తినడం మంచిదే కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవాలి అనుకున్న వారు పైన చెప్పినా అనారోగ్య సమస్యలు లేకపోతే వైద్యులు సలహా తీసుకొని ఆ తర్వాత తినడం మంచిది అని చెబుతున్నారు.