Site icon HashtagU Telugu

Pineapple: పైనాపిల్ ను ఇష్టపడి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Pineapple

Pineapple

ఫ్రూట్స్ లో ఒకటైన పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పైనాపిల్ కొన్ని సీజన్లో మాత్రమే మనకు లభిస్తూ ఉంటుంది. పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పైనాపిల్ తినడానికి కాస్త తీయగా పుల్లపుల్లగా ఉంటుంది. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు. కాగా ఈ పైనాపిల్ తో రకరకాల జ్యూస్ లు స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. పైనాపిల్ పోషకాల నిలయం. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్, ఐరన్ వంటి ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.

ఇది జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ పండు కొందరికి పడదు. కొన్ని సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తినకూడదట. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పైనాపిల్‌ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంపొందింస్తుంది. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైనాపిల్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పైనాపిల్‌ లో బీటా కెరోటిన్ ఉంటుంది. దీంతో ఈ పండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండ్లలో అధిక ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలు, షుగర్ లెవల్స్‌ ని కంట్రోల్ చేస్తాయి.

ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం పైనాపిల్‌ పండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పైనాపిల్ తినకూడదట. ఇది ఎక్కువగా తింటే అలర్జీ సమస్యలు రావచ్చని చెబుతున్నారు. చర్మం పై దురద, ఎర్ర బడటం, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి ఇలా వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా పైనాపిల్‌ కు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు పైనాపిల్ ని తినకపోవడమే మంచిది. గర్బిణీ స్త్రీలు, బాలింతలు పైనాపిల్‌ కు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌ కి అంత మంచిది కాదు. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు. నోటి పూత సమస్యలతో బాధపడే వారు కూడా పైనాపిల్ కు దూరంగా ఉండాలట. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల నాలుక, పెదవులు దురదగా అనిపించవచ్చు. అందుకే నోటిపూత సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు పైనాపిల్ ని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.

Exit mobile version