Chicken: ప్రతిరోజు చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే?

మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడది చికెన్. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 07:31 AM IST

మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడది చికెన్. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో ఎన్నో రకాల వెరైటీ రెసిపీలు చేసుకొని తింటూ ఉంటారు. కొంతమందికి వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చికెన్ ఉండాల్సిందే. కొందరు ప్రతిరోజు కూడా చికెన్ తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే చికెన్ తినడం మంచిదే కానీ, అలా అని ప్రతి రోజు చికెన్ తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ట్స్ టైం నియంత్రించుకోవడానికి కాల్చిన లేదా ఉడికించిన చికెన్ తినడం మంచిది. చికెన్ అధిక వేడి ఆహారంగా పరిగణించబడుతుంది.ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనికి కారణంగా కొంతమందికి ముఖ్యంగా వేసవిలో ముక్కు కావడం ఉండవచ్చు. ప్రతిరోజు చికెన్ తినడం వల్ల కూడా ఇలాంటీ పరిస్థితులు ఏర్పడతాయి. రోజూ చికెన్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ చికెన్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. రోజూ చికెన్ తింటే కీళ్లనొప్పులు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తాయి. రోజూ చికెన్ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.

చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. అయితే రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రోజూ చికెన్ ను తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి..రోజూ చికెన్ తింటే బరువు పెరగడం ఖాయం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.