Drumstick: ఏంటి మునగకాయ తింటే అలాంటి సమస్యలు వస్తాయా.. ఇందులో నిజమెంత?

మునగకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగు

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 01:30 PM IST

మునగకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. దీన్ని కొందరు వేపుడు రూపంలో తీసుకుంటే మరి కొందరు సాంబార్ రసం రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. ఇందులో ఉన్న పోషకాలు ఏ కూరగాయల్లో కూడా ఉండవు. అందుకే మునగకాయను అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా సమస్యలకు మునగకాయ చెక్ పెడుతుంది. మునగకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడే మంటను మునగకాయ తగ్గిస్తుంది.

విటమిన్ సీ, ఫైటో కార్నైడ్ అనే ఆమ్లాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి. మునగలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలనుకూడా మునగకాయ నశింపజేస్తుంది. చర్మ క్యాన్సర్, ఇతర అవయవాలకు సోకే క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో మునగకాయ దిట్ట. మీకు మెదడు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మునగకాయను తినాల్సిందే. మెదడు ఆరోగ్యానికి కావాల్సినవి డోపామైన్, సెరోటినిన్ అనే పదార్థాలు. ఇవి మునగకాయలో పుష్కలంగా ఉంటాయి. మునగకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది శరీరానికి అవసరమే కానీ మోతాదుకు మించి తినడం చాలా ప్రమాదకరం.

ఫైబర్ శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగా తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అతిసారం సమస్య వస్తుంది. మలబద్ధకం సమస్య వస్తుంది. పేగులకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. మునగకాయ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దాని వల్ల హైపోక్సేమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలన్నా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా మునగను ఎక్కువగా తీసుకోవద్దు. పరిమితంగానే తీసుకోవాలి. మునగకాయ ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు వస్తాయి. అందులో ఉండే కొన్ని రసాయనాలు అలర్జీలను కలిగిస్తాయట. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ అలెర్జీలకు గురవుతారట. దాని వల్ల చర్మం ఎర్రబారడం, చర్మం పై పొర ఊడిపోవడం లాంటి సమస్యలు వస్తాయి.